జయప్రకాశ్ నారాయణ. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి. పాపం.. రాజకీయ పార్టీ పెట్టి ఫెయిలయ్యారు కానీ.. లోక్‌సత్తా అధినేతగా ఆయనకు మంచి పేరుంది. ఐఏఎస్ ఉద్యోగాని త్రుణప్రాయంగా వదలుకుని ప్రజాసేవ కోసం లోక్‌సత్తా స్థాపించారాయన. 


అలాంటి జేపీ ఇటీవల కొన్ని వ్యాఖ్యలతో జనంలో పలుచన అవుతున్నారు.  గుడ్డిగా తెలుగుదేశం పార్టీని సమర్ధించడానికి వ్యాఖ్యలు చేస్తున్నారా.. అనిపిస్తోంది. ప్రత్యేకించి ఎపి లో ఇంటెలెజెన్స్ డిజిపి గా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పిల బదిలీపై ఆయన ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. 

ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి, ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని అడగకుండా.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి.. అదే నిజమైతే కచ్చితంగా అపశ్రుతి దొర్లినట్లే అని ఆయన అన్నారని ఆ పత్రికలో వచ్చింది. 

ఏపీ ఇంటెలెజెన్స్ విబాగంలో ఒకే కులం వారిని పలువురిని ఉన్నత పదవులలో నియమించుకోవడాన్ని, ఆ తర్వాత తెలుగుదేశం కు అనుకూలంగా పూర్తిగా మారిపోవడాన్ని జెపి సమర్దిస్తుండడం నమ్మశక్యం కాకుండా ఉంది. ఆయన ఇకపై  కూడా ఇలాగే మాట్లాడితే మంచి పేరు ఉన్న జేపీపై కూడా కులముద్ర పడే ప్రమాదం లేకపోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: