ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్‌ లో ఉందా.. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలను సంతృప్తి పరచలేకపోయారా.. అనువజ్ఞుడని అవకాశం ఇస్తే చంద్రబాబు ఉపయోగించుకోలేకపోయారు.. ఈ ప్రశ్నలకు కొన్ని సర్వేల్లో సమాధానం అవుననే వస్తోంది. 


ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు రెడ్ ప్రికి న్యూస్ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది. 

ఈ సర్వే ప్రకారం..జిల్లాల వారీ వివరాలు చూస్తే.. టీడీపీ వర్గాలకు షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి రెండు జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదట. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. వైసీపీ ఈ జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది.

అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది.. మొత్తం నియోజకవర్గాలు ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన ఖాతా తెరిచే ఛాన్సు లేదు. ఈ రెండింటి తర్వాత కడప జిల్లాలోనూ వైఎస్సార్ పార్టీ జోరు మీద ఉంది. ఈ జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. అంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడపీ ఖాతా తెరవదన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: