ఏపీలో ఈసారి కాబోయే సీఎం నేనే అంటున్నారు పవన్ కల్యాణ్.. ఆంధ్రదేశంలోని నలుమూలలూ ఆయన ప్రచారం జోరుగా చేస్తున్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని ధీమాగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాలు నొక్కి చెబుతున్నారు. 


కానీ ఆయన పార్టీ అసలు రాయలసీమలో బోణీయే చేయదట. అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి అంచనా ఇది. కోస్తా జిల్లాలలో ఎక్కడైనా జనసేన కొన్ని సీట్లు గెలుస్తుందేమో కాని, రాయలసీమలో బోణి చేసే పరిస్తితి లేదని ఆయన ఢంకా భజాయిస్తున్నారు. జనసేన రాయలసీమలో ఒక్క సీటు గెలవలేదని అన్నారు. 

జనసేనపైనే కాదు.. తన భవిష్యత్ కార్యాచరణపై కూడా జేసీ మాట్లాడారు.. తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదని, ప్రజా జీవితంలో ఉంటానని ఆయన
అన్నారు. తన కుమారుడు ఎమ్.పిగాను, తన తమ్ముడి కుమారుడు ఎమ్మెల్యేగా గెలుపొందుతారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

తాను సూచించిన విధంగా నలభై శాతం సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే, వారిపై ఉన్న వ్యతిరేకత తగ్గేదని, అలా చేయలేకపోయారని జేసీ అన్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎమ్మెల్యే గెలిచినట్లు అని, ఓడితే పార్టీ సరైన నిర్ణయం తీసుకోనట్లు అవుతుందని దివాకరరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. మరి జేసీ వ్యాఖ్యలపై పవన్, జనసేన ఎలా స్పందిస్తాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: