2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపొందిన సీట్ల‌లో దెందులూరు ఒక‌టి. కొల్లేరు, త‌మ్మిలేరుతోపాటు డెల్టా, మెట్ట ప్రాంతాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. కృష్ణా, గోదావ‌రి కాలువ‌కు చివ‌రి భూములు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌టంతో రైతులు, రైతు కుటుంబాల పాత్ర ఇక్క‌డి రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉంటుంది.దెందులూరు నుంచి ముచ్చ‌ట‌గా మూడోసారి గెల‌వాల‌ని చూస్తున్న ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ 2001లో దుగ్గిరాల ఎంపీటీసీగా ఎన్నిక‌య్యారు.

పెద‌వేగి ఎంపీపీగా ప‌నిచేశారు. 2009, 2104లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నారు.అయితే, చింత‌మ‌నేనిపై ఈ సారి వైసీపీ నుంచి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి బ‌రిలోకి దిగారు. బీటెక్ చ‌దువుకున్న ఆయ‌న లండ‌న్‌లో సాఫ్ట్‌వేర్ బిజినెస్ చేస్తూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వైసీపీ ఇన్‌చార్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

2009లో అబ్బ‌య్య చౌద‌రి తండ్రి రామ‌చంద్ర‌రావు కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారం వేడెక్క‌డంతో చింత‌మ‌నేని, అబ్బ‌య్య చౌద‌రి ఒక్క‌సారిగా మాట‌ల యుద్ధం ముదిరింది. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ టార్గెట్‌గా అబ్బ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తే అదే స్పీడ్‌తో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వాటికి స‌మాధానం ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: