న్యాయవ్యవస్ధపై చంద్రబాబునాయుడుకు అపారమైన పట్టుందని అందరూ అంటుంటారు. అందులో వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు. మరి అలాంటి పట్టు జారిపోతోందా ? చంద్రబాబు పట్టునుండి న్యాయవ్యవస్ధ విడిపించుకుంటోందా ? కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి.


గడచిన నెల రోజుల్లో న్యాయవ్యవస్ధలో చంద్రబాబుకు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటిది జగన్ పై హత్యాయత్నం కేసు. తర్వాతది వైసిపి అభ్యర్ధి గోరంట్ల మాధవ్ నామినేషన్ వ్యవహారం. ఇక మూడోది తాజాగా ఐబి చీఫ్ వెంకటేశ్వరరావు బదిలి వ్యవహారం. చంద్రబాబుకు ఆలోచనలకు వ్యతిరేకంగా వరుసగా మూడు ఘటనల్లో కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇవ్వటం మామూలు విషయం కాదు.

 

జగన్ పై హత్యాయత్నం కేసునే తీసుకుందాం. హత్యాయత్నం జరగ్గానే చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ విచారణను వ్యతిరేకిస్తు జగన్ అండ్ కో న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. థర్గ్ పార్టీ విచారణ కావాలని కోరారు. సరే రోజుల తరబడి విచారణ తర్వాత హై కోర్టు కేంద్రం పరిధిలోని ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

 

రాబోయే ఎన్నికల్లో హిందుపురం పార్లమెంటు స్ధానానికి వైసిపి తరపున గోరంట్ల మాధవ్ అనే మాజీ పోలీసు అధికారి నామినేషన్ వేశారు. మాధవ్ ను నామినేషన్ వేయనీయకుండా ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. మాధవ్ ట్రైబ్యునల్ కు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్న ప్రభుత్వం కోర్టుకెక్కింది. చివరకు కోర్టు గట్టిగా ప్రభుత్వంపై మొట్టికాయలేసిన తర్వాత వేరే దారిలేక మాధవ్ నామినేషన్ కు అంగీకరించారు.

 

ఇక తాజాగా ఐబి చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు విషయం చూద్దాం. ఐబి చీఫ్ పై వైసిపి ఆధారాలతో కూడిన అనేక ఆరోపణలు చేసింది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏబితో పాటు మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ముందు సరేఅన్న ప్రభుత్వం తర్వాత ఏబి బదిలీ విషయంలో అడ్డం తిరిగింది. ఈసి అధికారాలపై ఏకంగా కోర్టుకెక్కారు చంద్రబాబు. ఒకవైపు ఈసి లాయర్, మరోవైపు వైసిపి లాయర్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.

 

వాళ్ళిద్దరి ధాటికి తట్టుకోలేక ప్రభుత్వం తరపున కోర్టులో అడ్వకేట్ జనరల్ చేతులెత్తేశారు. చివరకు కోర్టు కూడా ఈసి అధికారాల్లో జోక్యం చేసుకోమని చెప్పేసింది. అంతే కాకుండా ఈసి ఆదేశాలను పాటించాలని చెప్పింది. దాంతో ఏబిని బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సొంచ్చింది. చూశారుగా కోర్టుల్లోనే చంద్రబాబుకు వరుసగా మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. చూస్తుంటే చంద్రబాబు పట్టుజారి పోతోందనే అనిపిస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: