ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా చెంపపెట్ట్లు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెడుతున్నాయి.
high court of andhra pradesh amaravati కోసం చిత్ర ఫలితం
*ఇప్పటికే హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాథవ్ వీఆర్ఎస్ వ్యవహారంలో, *ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయగా.. *తాజాగా ఇవాళ వివేకానందరెడ్డి హత్య కేసులో బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం సర్కారుకు ఇబ్బందికరంగా మారనుంది.
*ఇంటిలిజెన్స్ ఛీఫ్ కేసు విచారించిన న్యాయస్ధానం, సీఈసీ విధుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
AB Venkateswara rao and other IPS Transfers high court orders కోసం చిత్ర ఫలితం
*ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలను తాత్కాలికంగా వాయిదా వేయించగలిగినా, మరో నాలుగు రోజుల్లో ఏపి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
high court of andhra pradesh amaravati కోసం చిత్ర ఫలితం
హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా, పెండింగ్ లో ఉన్న ఆయన వీఆర్ఎస్ కు ఆమోదం తెలపకుండా ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. అడ్మినిస్ట్టేటివ్ ట్రైబ్యునల్ మాధవ్ వీఆర్ఎస్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా, చట్ట బద్ధత ఉన్నా పట్టించుకోకుండా హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. మాధవ్ ను వెంటనే రిలీవ్ చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

TDP and Court recent Judgements in three key cases కోసం చిత్ర ఫలితం

మరో వైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన జగన్మోహనరెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనూ ప్రభుత్వానికి అక్షింతలు తప్పలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో రోజుకో లీక్ రావడం, టీడీపీ అధినేత చంద్రబాబు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో వైసీపీ నేతలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన హైకోర్టు, కేసు వివరాలు బయట పెట్టొద్దంటూ పోలీసులను ఆదేశించడంతో పాటు వివేకానంద రెడ్డి హత్యపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రాజకీయపార్టీల నేతలతో పాటు అందరికీ వర్తించేలా అదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలన్న టీడీపీ వ్యూహం చిత్తయింది. వారం రోజుల వ్యవధిలో మూడు కీలక కేసుల్లో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఎన్నిక ల వేళ టీడీపీకి ఇబ్బందికరంగా పరువు ప్రతిష్టలు మంటగలిపాయి. 

viveka murder case high court orders కోసం చిత్ర ఫలితం

ఆ తరవాత వైసీపీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఇంటిలిజెన్స్ ఛీప్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. దీన్ని తొలుత అంగీకరిస్తూ ముగ్గురినీ బదిలీ చేసిన సర్కారు, కొద్ది సమయం లోనే జీవో రద్దు చేసి కేవలం ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో ఇచ్చింది. ఇంటిలిజెన్స్ ఛీఫ్ కు ఎన్నికల విధులతో సంబంధం లేదంటూ విచిత్రమైన తర్కం  తెరపైకి తెచ్చిన ప్రభుత్వం, సీఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది. చివరికి కేసు విచారించిన న్యాయస్ధానం, సీఈసీ విధుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది.  హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మరో జీవో జారీ చేసి ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏపి వెంకటేశ్వరరావును బదిలీ చేసింది.

AB Venkateswara rao and other IPS Transfers high court orders కోసం చిత్ర ఫలితం
ఆయా కేసుల్లో వాదిస్తున్న ఏజీతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు సైతం న్యాయ స్ధానాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల ను ఏప్రిల్ 3వ తేదీ వరకూ తాత్కాలికంగా వాయిదా వేయించినా,  ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో? చెప్పలేని పరిస్ధితి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు.

jagan happy with recent court judgements against TDP కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: