అవును ఎన్నికలు మరో రెండు వారాల్లో ఉందనగా చంద్రబాబునాయుడుక పెద్ద షాక్ తగిలింది. కడప జిల్లాలో రాజంపేట మాజీ ఎంపి సాయిప్రతాప్ తెలుగుదేశంపార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలోకి తనను ఆహ్వానించి మరీ చంద్రబాబు అవమానించారంటూ ఆవేధనతో చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు సాయిప్రతాప్ టిడిపికి రాజీనామా చేయటం గట్టి దెబ్బనే చెప్పాలి.

 

సాయిప్రతాప్ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు గెలిచారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపున్న సాయి వైఎస్ మరణం తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు వైఎస్ కుటుంబానికి కూడా దూరమయ్యారు. కారణాలు సరిగా తెలీదుకానీ వైసిపిలో చేరాలని సాయి అనుకున్నా తర్వాత అడుగు ముందుకు పడలేదు. అదే సమయంలో కొందరు నేతల చొరవతో టిడిపిలో చేరారు.

 

పార్టీలో చేరిన దగ్గర నుండి చంద్రబాబు తనను అనేకమార్లు అవమానించారని సాయి ఇపుడు మండిపడుతున్నారు. తన అల్లుడికి టికెట్ ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదట. నిజానికి రాజంపేట నుండి లోక్ సభకు పోటీ చేయటానికి చంద్రబాబుకు సరైన క్యాండిడేట్ దొరక లేదు. అందుకనే చిత్తూరు ఎంఎల్ఏ సత్యప్రభను బలంతంగా ఇక్కడ ఎంపిగా పోటీ చేయిస్తున్నారు.

 

మరో రెండు వారాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో సాయి రాజీనామా చేయటం చంద్రబాబుకు పెద్ద షాకే. ఎందుకంటే, నియోజకవర్గం పరిధిలో సాయికి ప్రత్యేకమైన మద్దతుదారులున్నారు. బలిజ సామాజికవర్గానికి చెందిన సాయిప్రతాప్ కు సామాజికవర్గంలో కూడా గుర్తింపుంది. ఏ పార్టీలో చేరేది రెండు రోజుల్లో ప్రకటిస్తానంటున్నారు. అయితే వైసిపిలో చేరేందుకే అవకాశం ఉందని ఓ సమాచారం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: