శనివారం జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలోని శ్రీనగర్-జమ్మూ రహదారిపై పేలుడు సంభవించింది.  ఈ పేలుడు శనివారం నుంచి జమ్మూ వైపు వెళ్తున్న హైవేలో ఉదయం సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని బంనిహల్ పట్టణంలో జరిగింది.  దీనికి సమీపంలోనే సీఆర్‌పీఎఫ్‌కు సంబంధించిన కాన్వాయ్‌ ఉండటంతో ఉగ్రవాదులపనేనా అన్నకోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే కారు వెనుక భాగంలో సిలిండర్ లీక్ కావడం వల్ల పేలుడు సంబవించిందని అధికారులు అంచనాకు వచ్చారు.  దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.   

ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నారు.  కొద్ది రోజుల కిందటే పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది స్కార్పియో కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 43 మంది జవాన్లు అమరులయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: