ఎన్నికలు యుద్ధంలో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. కొన్ని బాటకు కనిపిస్తాయి. మరికొన్ని అసలు కనిపించవు. ఏ వ్యూహనికైనా  టార్గెట్ ని రీచ్ కావడమే కావాలి. దానికి తగినట్లుగానే వ్యూహాలు నడుస్తూ ఉంటాయి. ఏపీ రాజకీయాల్లోనూ రాజకీయ చాణక్యుడు చంద్రబాబు వ్యూహాలు రచిస్తూంటే ప్రతి వ్యూహాలు కూడా సిధ్ధమన్వుతున్నాయి.


ఇక విషయానికి వస్తే ఈ మధ్య జగన్ తన మీటింగుల్లో యాక్టర్, పార్టనర్ అని పవన్ని పిలుస్తున్నారు. అయ్యా యాక్టర్ గారు, పార్టనర్ గారూ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే దీని వెనకాల జగన్ వ్యూహాలు ఆయనకు  ఉన్నాయని అంటున్నారు. పవన్ని అసలు పొలిటికల్ లీడర్ గా చూడడం జగన్ కి ఇష్టం లేదని, ఆయన్ని ఒకటి అని నాలుగు అనిపించుకోవడం కూడా  దండుగ అన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు. అందుకే పేరు పెట్టి పిలవకుండా యాక్టర్ గానే పిలుస్తున్నారంటున్నారు. 


ఇక పార్టనర్ అంటూ బాబుకు, జనసేనకు లింక్ పెట్టడం ద్వారా ప్రభుత్వ  వ్యతిరేక ఓట్ల చీలికను అడ్డుకోవాలన్నదే జగన్ ప్లాన్ గా ఉందంటున్నారు. పవన్ని పక్కన పెట్టి ఓట్లు భారీగా చీల్చి లబ్ది పొందాలని బాబు ప్లాన్ వేశారన్నది అంతా అనుకుంటున్నారు. దానికి విరుగుడుగా జగన్ ఆయన్ని ఏకంగా బాబుకే పార్టనర్ అని జనాలకు చెప్పడం ద్వార పవన్ పాత్ర ఏమీ లేకుండా చేఅయాలని ప్రతి వ్యూహం రచించారని అంటున్నారు. 


ఇప్పటికైతే జనాల్లో బాబు పవన్ ఒకటి అన్న అభిప్రాయం బాగా వెళ్ళిపోయింది. ఇందుకు జగన్, వైసీపీ చేస్తున్న ప్రచారం కారణం అంటున్నారు. మొత్తానికి బాబు వ్యూహానికి ప్రతి వ్యూహం రచించడమే కాకుండా జగన్ పవన్ పేరెత్తకుండా ఎక్కడ కెలకాలో అక్కడ కెలుకుతున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: