మోహన్ బాబు ఆంధ్రులకు, ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది.  విలక్షణ నటుడుగా, డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ అంటూ పిలిపించుకోవడమే కాకుండా..ఏ విషయంలోనైనా తనదైన ముక్కుసూటి నైజంతో మాట్లాడటం మోహన్ బాబు ప్రత్యేకత.  ఎన్టీఆర్ గారి తెలుగు దేశం పార్టీలో యాక్టీవ్ మెంబర్ గా ఉంటూ పార్లమెంట్ కి ఎన్నుకోబడి పార్టీలో పలు పదవులు కూడా చేసినాయన ఎన్టీఆర్ మరణం తరువాత కామ్ అయిపోయారు. రాజకీయాలకు కటీఫ్ చెప్పేశారు. 


వైఎస్ కుటుంబంతో వియ్యమంది.. రాజశేఖర్ రెడ్డి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో రాజకీయ పునఃప్రవేశం గురించి ఏ మాత్రం పెదవి విప్పకుండా సినిమా రంగంలోనే కొనసాగినారు మోహన్ బాబు. దశాబ్దాల కాలం తర్వాత శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేతగా ఫీజు రి-యింబర్సమెంట్ సరిగా రావడం లేదని..తేదేపా..చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులను సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుందని దాదాపు రెండు సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తు గురించి నెత్త-నోరు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని ఆఖరి పోరాటంగా రోడ్డెక్కారాయన. 


అన్ని ఉద్యమాలు, జనపోరాటాల్లానే వీరి మీద కూడా తేదేపా ప్రభుత్వం ఎదురుదాడి చేయడం..మోహన్ బాబు తిరిగి రాజకీయా పునఃప్రవేశం వైసీపీలో చేరడం చక-చకా జరిగిపోయాయి.  మోహన్ బాబుది-చంద్రబాబుది చిత్తూరే..మోహన్ బాబు, చంద్రబాబు కంటే ముందే తేదేపాలో మెంబరు, మోహన్ బాబు, చంద్రబాబు కంటే ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడిగా మెలిగారు..ఎన్టీఆర్-మోహన్ బాబు ల సాన్నిహిత్యం ఎన్టీఆర్-చంద్రబాబు కన్నా ముందే మొదలైంది.  


మోహన్ బాబు మెల్లగా తన విషయ పరిజ్ఞానాన్ని జనాలకు అర్తం అయ్యే విధంగా చెప్పడం మొదలు పెట్టారు.  ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వకుండా చంద్రబాబే చేసారని, ఎన్టీఆర్ విరోధించిన కాంగ్రెస్ ను వాటేసుకున్నారని..ఎన్టీఆర్ దగ్గర్నుండి పార్టీ లాక్కున్నారని..రానున్న రోజుల్లో ఇంకా ఏమేం చేబుతారో..


మరింత సమాచారం తెలుసుకోండి: