తెలంగాణ ఎన్నికల్లో  ఎప్పుడైతే చంద్రబాబు వేలు పెట్టాడో అప్పటి నుంచి కేటీఆర్ అండ్ కేసీఆర్ టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇప్పటికే కేసీఆర్ .. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ .. తన టీం తో ఆంధ్రాలో సర్వే చేయించాడంటా .. ఆ సర్వేల్లో ఖచ్చితంగా వైస్సార్సీపీ గెలుస్తుందని, వైసీపీకి సుమారు 110 నుంచి 120 సీట్లు వస్తాయని టీడీపీకి 55 నుంచి 60 సీట్లు దాకా వస్తాయని సర్వేలో తేలిందంటా.. అందుకే కేటీఆర్ కూడా మీడియా ముందు కాబోయే సీఎం జగన్ అని ఘంటా పథంగా చెబుతున్నాడు.


కేటీఆర్ మాట్లాడుతూ .. ఏపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశాలను ప్రస్తావిస్తూ.... టీఆర్ ఎస్ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టే యత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తూ వస్తున్న టీఆర్ ఎస్ నేతలు... అప్పుడప్పుడు మాత్రమే ఏపీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు.


అది కూడా ఫెడరల్ ఫ్రంట్ లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేస్తున్న గులాబీ నేతలు... మరే విషయాలు మాట్లాడటం లేదు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఏపీలో వైసీపీదే విజయమని టీఆర్ ఎస్ నేతలు ఎప్పుడో తేల్చేశారు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇదే విషయాన్ని చాలా సార్లే చెప్పారు. తాజాగా నేటి ప్రచారంలో భాగంగా అదే మాటను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఏపీలో జగనే గెలుస్తారని - ఆయన ఏపీ సీఎం కావడం తథ్యమని కూడా కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ తన సర్వే రిపోర్ట్స్ చూసి బలంగా చెప్పి ఉంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: