ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది, నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు కూడా ముగియటంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య గట్టి పోటీ నడుస్తుండగా, కొత్తగా రేసులోకిచంద్రబాబు కూడా క్రియాశీలక పాత్ర పోషించే దిశగా అడుగులేస్తోంది. ముఖ్యంగా టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది, జగన్ పై చంద్రబాబు ప్రధానంగా చంద్రబాబు చేస్తున్న ప్రధాన ఆరోపణ మోడీ, కేసీఆర్ లతో కలిసిపోయారని, రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు.


జగన్ కు ఓటేస్తే మోడీకి వేసినట్టే అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు. తాజాగా, మోడీ కర్నూల్ పర్యటన సందర్బంగా మరోసారి జగన్, మోడీలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. కర్నూలు సభలో మోడీ జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని, జగన్ కోసమే మోడీ ఆంధ్రాలో పర్యటిస్తున్నారని అన్నారుఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది, మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడుతుంది జగన్ కాదు, చంద్రబాబు అని చెప్పుకున్నారు.


చంద్రబాబు ఎక్కడ ప్రసంగించినా కూడా జగన్ ఓటేస్తే మోడీకి వేసినట్టే, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ, కేసీఆర్ లతో జగన్ కలిసిపోయారు లాంటి విమర్శలే ఎక్కువ శాతం చేస్తున్నారు. వైసీపీ, బీజేపీలు కలిసిపోయినట్టు ఎక్కడా ఆధారలైతే లేవు, ఒకవేల టీడీపీ ఆరోపిస్తున్నట్టు కలిసిపోయారు అనుకుందాం అలాంటప్పుడు వైసీపీకి ఫెవర్ గా బీజేపి డమ్మీ కాండిడేట్స్ ను ఏమి బరిలోకి దింపలేదే, ఇరు పార్టీల అభ్యర్థుల జాబితా గమనిస్తే అర్థమవుతుంది. చంద్రబాబు ఇకనైనా జగన్, మోడీలను విమర్శించటమే పనిగా కాకుండా తమ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిని తిరిగి అధికారంలోకి వస్తే చేయబోయే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: