చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించిన నాయకుడు.. అత్యధిక కాలం పాలించి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. ఆయన 1995లో మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని తప్పించి మరీ ఆయన ముఖ్యమంత్రి అయినా.. ఆయన పాలనదక్షతతో జనం ఆమోందిచే పరిస్థితి ఉంది. 


1990లలో చంద్రబాబు డైనమిక్ నాయకుడు.. ఒక చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పం ఆయనలో కనిపించేవి. అధికారులను జవాబు దారీ తనం చేయడం.. విజన్‌ తో ప్రణాళికలు రూపొందించడం.. ఇలాంటి చర్యలతో పాలనాదక్షుడిగా అనతికాలంలోనే పేరు సంపాదించుకున్నారు. 

అప్పట్లో ఆయన తన పాలన నచ్చితే ఓటేయమని చెప్పి ప్రజాక్షేత్రంలో మళ్లీ అధికారం సంపాదించుకోగలిగారు. అయితే విచిత్రం ఏంటంటే.. 1990లలోని చంద్రబాబుకూ ఇప్పటి చంద్రబాబుకూ అసలు పోలికే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు వ్యాకరణం నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన పూర్తిగా ఒత్తిళ్లకు లోనవుతున్నారని ఆయన అంటున్నారు. 

గతంలో తాను చేసింది చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు విపక్షం బలహీనతలపై ఆధారపడాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రసంగాలు చూస్తుంటే.. ఈయనేనా పాత చంద్రబాబు అని సందేహం వస్తుందన్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన చంద్రబాబు గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోవడం అస్సలు ఊహించలేమని.. బీజేపీతో పొత్తు ఉన్నా పెద్దగా ఏమీ సాధించలేకపోయారని..  వ్యాకరణం నాగేశ్వరరావు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: