ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తేల్చేందుకు రెడ్‌ ప్రికి న్యూస్ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది. 


ఈ సంస్థ సర్వే ఫలితాలను బట్టి చూస్తే.. పవన్న కల్యాణ్ తన సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుస్తారని చెబుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో..జనసేనకు 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. భీమవరంలో పవన్ కల్యాణ్ తో పాటు తాడేపల్లి గూడెంలోనూ ఆ పార్టీ గెలుస్తుందట. 

పశ్చిమ గోదావరి జిల్లాలో కాపుల సంఖ్య ఎక్కువే. అందులోనూ యూత్ ఓటర్లు జనసేన వైపు మొగ్దుతున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ సొంత జిల్లాపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఎనిమిది నుంచి పది స్థానాలు గెలుస్తామని అంచనాలు వేసుకున్నారు. 

కానీ గ్రౌండ్ రియాలిటీని బట్టి చూస్తే అంత సీన్ లేదని తెలుస్తోంది. కేవలం రెండు స్థానాలు అందులోనూ ఒకటి పవన్ కల్యాణ్ పోటీ  చేస్తున్న నియోజకవర్గంలోనే జనసేన గెలుస్తుందని ఈ సర్వే చెబుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 11 సీట్లే వస్తాయని అంచనా వేస్తోందీ రెడ్‌ ప్రికి న్యూస్ సంస్థ.



మరింత సమాచారం తెలుసుకోండి: