వైఎస్ జగన్ ఓ రాజకీయ పార్టీ నాయకుడు. తాను ముఖ్యమంత్రి అవుతానని రోజుకు వందసార్లు చెప్పుకుంటున్నారు. అది సహజం, ఇక జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారంలోనూ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా జగనే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు.


వీరందరి కంటే ఎక్కువగా జగన్ ముఖ్యమంత్రి  అంటున్నది ఎవరో తెలుసా.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన రోజుకు ఈ మాట  ఎన్నిసార్లు అంటున్నారో లెక్కే లేదు. జగన్ ముఖ్యమంత్రి ఈ రెండు మాటలు బాబుకు ఓ విధంగా ఊతపదాలుగా మారిపోయాయి. ఆయన జగన్ని విమర్శిస్తూ అంటున్నా జగన్ ముఖ్యమంత్రి అన్న మాట జనంలోకి బాగానే వెళ్ళిపోతోంది. పెద్ద‌ ఎత్తున టీడీపీ మీటింగులు పెట్టి మరీ చంద్రబాబుని ప్రచారానికి తెస్తే ఆయన సభల్లో అంటున్న మాటల్లో నూటికి తొంబై సార్లు జగన్ మాటే. జగన్ సీఎం అని. ఓ విధంగా ఇది జగన్ కి ప్రచారం గా మారిపోవడంలా అని తమ్ముళ్ళే అంటున్నారు.


ఇక చంద్రబాబు ఇంకో మాట అంటున్నారు. జగన్ సీఎం అయితే రాజధాని బంద్ ట. పోలవరం ఆగిపోతుందట. అభివ్రుద్ధి ఉండడత. రౌడీ రాజ్యం వస్తుందట. ఇవన్నీ చెబుతూ జగన్ ముఖ్యమంత్రి అయితే అని అంటూ  ఏదో అవుతుందని  ఏదో తెలియని ఆసక్తినే    బాబు జనాలకు పెంచుకుతున్నాడనుకోవాలి. ఇంతకాలం బాబు ని చూశారు అంతకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కూడా చూశారు. ఇపుడు జగన్ కి ఓ చాన్స్ ఇస్తే పోలా అని ఏపీ జనం అనుకుంటే బాబు ప్రచారం మొత్తం వైసీపీకే ఉపయోగపడుతుంది కదా. జగన్ ముఖ్యమంత్రి అయితే దాకా వచ్చేసిన చంద్రబాబు తన ఓటమిని తానే అంగీకరిస్తున్నారని  అన్ ఇ కూడా అంటున్నారు. లేకపోతే రోజుకు ఎందుకు ఇన్ని సార్లు జగన్ సీఎం అంటూ టీడెపీ సభల్లో వూదరగొడతారని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: