ఏపీలో ఇపుడు జరుగుతున్న ఎన్నికలు కీలకంగా భావించాలి. గతంలో జరిగిన ఏ ఎన్నికతోనూ పోల్చడానికి వీలులేనివి ఈ ఎన్నికలు, నిజంగా చెప్పాలంటే నవ్యాంధ్ర ఏర్పాటు అయిన తరువాత పదమూడు జిల్లా ఏపీకి తొలిసారి జరుగున్న ఎన్నికలుగా వీటిని చూడాలి. ఈ ఎన్నికల్లో ప్రజల చైతన్యం మరోసారి లోకానికి తెలుస్తుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అంతా ఎదురుచూస్తున్నారంటేనే  వెరీ వెరీ స్పెషల్ అని తెలిసిపోతోంది.


ఈ ఎన్నికల్లో తీర్పు ఏంటన్నది ఏప్రిల్ 11న ఈవీఎంలలో తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు  ఎలా రియాక్ట్ అవుతున్నది మాత్రం ఎన్నికల ప్రచారంలో చూచాయగా తెలుస్తోంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు సభలు, మరో వైపు జగన్ సభలు జరుగుతున్నాయి. రెండింటినీ చూసినపుడు జగన్ సభల్లో రెస్పాన్స్ ఎక్కువగా వస్తోంది. బాబు సభలకు జనం వస్తున్నా కూడా అక్కడ లేని చైతన్యం ఏదో జగన్ మీటింగుల్లో కనిపిస్తోంది. దీన్ని మార్పుగానే చూడాలా అన్నది ఆలోచించాలి ఇక జగన్ సభలు పట్ట పగలు, మంది ఎండల్లో పెడుతున్నారు, ఆ సభలకు జనం వెల్లువలా వస్తున్నారు. గంటల తరబడి జగన్ కోసం ఎదురుచూస్తున్నారు.


నిజానికి వేసవి ఎండలు ఈసారి గట్టిగా ఉన్నాయి. అయినా జనం పట్టించుకోలేదంటే దాని వెనక బలీయమైన ఆకాంక్షఉండి ఉంటుంది. అదేమిటన్నది కూడా ఆలోచించాలి. ఇక జగన్ ఒక్కరికే కాదు, ఆయన తల్లి విజయమ్మ మీటింగులకు, సోదరి షర్మిల మీటింగులకు కూడా జనం ఇదే తీరున ఎగబడివస్తున్నారు.  ఇక బాబు సభలు , రోడ్ షోలలో  కూడా జనంతో నిండి ఉన్నా కూడా అక్కడ రియాక్షన్ తక్కువగా ఉంటోంది. ఇవన్నీ బేరీజు వేసుకున్నపుడు ఏదో తెలియని అండర్ కరెంట్ అన్నది ఉందని అర్ధమవుతూంది. అదేంటన్నది చెప్పలేకపోయినా జగన్ వైపు మొగ్గు ఉందన్నది మాత్రం తెలిసిపోతోంది.  ఏపీ జనం మార్పు కోరుకుంటున్నారని కూడా చెప్పాల్సివస్తోంది. జగన్ మీటింగులకు వచ్చిన రియాక్షన్ కనుక ఇలాగే పోలింగ్ వరకూ కొనసాగితే మాత్రం భారీ ఎత్తున రాజకీయ మార్పులు తప్పవన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అది నిశ్శబ్ద విప్లవంగా మారితే ఏపీలో కీలకమైన పరిణామాలు తప్పవు మరి. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: