ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మొదటిసారే ఓటమితో ప్రత్యక్ష ఎన్నికల ప్రస్థానం ప్రారంభించబోతున్నారా.. ఎంతో సేఫ్ సీటుగా ఎన్నో లెక్కలు వేసుకున్నా చివరకు మంగళగిరిలో ఆయనకు ఓటమి తప్పడం లేదా.. గత ఎన్నికల్లో కేవలం 14 ఓట్ల తేడాతో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి మంగళగిరిలో జెండా పాతనున్నారా.. 


అవునంటోంది ఓ సర్వే సంస్థ. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తేల్చేందుకు రెడ్‌  ప్రికి న్యూస్ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. 

ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది. ఈ సంస్థ సర్వే ఫలితాలను బట్టి చూస్తే.. మంగళగిరిలో తెలుగుదేశం ఓటమి ఖాయమట.  అది కూడా కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనేనట. 

మంగళగిరిలో తెలుగుదేశానికి 38 శాతం ఓట్లు వస్తున్నాయి. వైసీపీకి 39 శాతం ఓట్లు వస్తున్నాయి. జనసేన మద్దతు తెలిపిన సీపీఐ అభ్యర్థికి కూడా 23 శాతం వరకూ ఓట్లు వస్తున్నాయట. చివరకు ఒక్క శాతం ఓట్ల తేడాతో వైసీపీ జయకేతనం ఎగరేయబోతోందట. మరి ఈ సర్వే ఏమేరకు నిజమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: