ఏపీ మంత్రి, టీడీపీ యువ‌నేత నారా లోకేష్ చేసే కామెడీల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని సంగ‌తి తెలిసిందే. తేదీల‌ను త‌ప్పుగా ప‌ల‌క‌డం, సంద‌ర్భాన్ని పూర్తిగా సంబంధం లేకుండా పేర్కొన‌డం, విమ‌ర్శ‌ల్లో సైతం త‌మ పార్టీపైనే సెల్ఫ్ గోల్ చేసేలా ఉండ‌టం వంటివాటికి ఆయ‌న సుప‌రిచితుడు. ఇలాంటి ఎపిసోడ్‌ల‌తో తండ్రి చాటు కొడుగుగా రాజకీయాలలోకొచ్చిన నారా లోకేష్ ప్రసంగాలంటేనే కామెడీగా మారింది. రాజకీయాలలోకి వ‌చ్చిన తొలి రోజుల్లోనే మాటల్లో తడబాటుపై ప్రత్యర్థి వర్గాలు వ్యంగ్యాస్త్రాలు సంధించేవి. అయిన‌ప్ప‌టికీ లోకేష్ పెద్ద‌గా మార్పు చెంద‌లేదు.


ఈ మధ్యనే ఏప్రిల్ 11 ఎన్నికలైతే ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకే ఓటేయాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా మారడమే కాదు ప్రత్యర్థులకు అస్త్రంగాను మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ తప్పులో కాలేశాడు లోకేష్‌. గుంటూరు జిల్లా రాజధాని అమరావతి ప్రాంతం మంగళగిరి నుండి పోటీకి దిగుతున్న లోకేష్ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా, మే 23న కౌంటింగ్ పూర్తవుతుందని అనడానికి బదులు మార్చి 23న ఓట్ల కౌటింగ్ జరుగుతుందన్నాడు. ఇంకేముంది ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. 


లోకేష్ ప్ర‌చారం సంగ‌తేమో కానీ ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రాలు అందిస్తున్నార‌ని కొంద‌రు అంటుంటే....కావాల్సినంత హాస్యం పంచుతున్నార‌ని ఇంకొంద‌రు అంటున్నారు. స్థూలంగా స్పీచ్ అంటేనే పెద్ద కామెడీ అనేవ‌ర‌కు చేరిపోయిందంటున్నారు. లోకేష్ బాబు ఎప్పుడు మార్చుకుంటారో ఏమో మ‌రి.!!


మరింత సమాచారం తెలుసుకోండి: