ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ పబ్లిక్ కు తెలిసిపోతుంది. పైడ్ న్యూస్ కు కాలం చెల్లిపోయింది. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే ఛానల్ లు ఇక మూసేసుకోవలసిందే. అయితే కొంతమంది సోషల్‌ మీడియా ద్వారా తమ అధ్యయన ఫలితాలను పంచుకొంటూ ఉన్నారు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఒక అధ్యయన సంస్థ ఈ ఫలితాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా సాగించిన సర్వేల్లో తాము తెలుసుకున్న విషయాలను విశదీకరిస్తున్నారు వాళ్లు. వాటిప్రకారం.. మొత్తం నూటా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అరవై ఏడు అసెంబ్లీ సీట్లలో విజయావకాశాలను కలిగిఉంది.


ఈ సర్వేను సెలెక్టివ్‌గా చేశారు. ప్రత్యేకించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల ప్రాంతంగా భావించబడిన ప్రాంతాల్లో ఈ సర్వే చేయలేదు. కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాలను మినహాయించి ఈ సర్వేను చేశారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాలో ఈ సర్వే సాగింది. ఈ అధ్యయనం ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం అరవై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ సమీప ప్రత్యర్థులపై పదివేల ఓట్లకు పైగా మెజారీటీతో ఉంది. మరో ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండోస్థానంలో ఉంది.


తెలుగుదేశం పార్టీ కేవలం పదిహేడు స్థానాల్లో మాత్రమే ఒకటో స్థానంలో ఉంది. మిగిలిన అన్ని నియోజకర్గాల్లోనూ రెండు, మూడోస్థానాల్లో ఉంది. జనసేన పదిహేడు స్థానాల్లో మొదటిస్థానంలో ఉంది. మిగతాచోట్ల.. చాలా వరకూ మూడోస్థానంలో ఉంది. ప్రధానంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిగా అండగా నిలబడిన జిల్లాల్లో ఈ సర్వేసాగింది. అలాంటి చోటే వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అరవై ఏడు స్థానాల్లో లీడ్‌లో ఉండటం విశేషం. కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో జగన్‌ పార్టీ సాధించగలిగే సీట్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వాటిని కలుపుకుంటే..ఈ సర్వే ఫలితాలను బట్టి.. ఏపీలో జగన్‌ పార్టీకి వందకు పైగా సీట్లు రావడం ఈజీనే !

మరింత సమాచారం తెలుసుకోండి: