తనకు నచ్చినప్పుడు ఎస్పీవై రెడ్డి ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారే వైఖరి ఇప్పుడు ఏకంగా ఆయన పరువు, అతని కుటుంబం పరువు గంగలో కలిసిపోయే లాగా చేసింది. ఎస్పీవై రెడ్డి గతం చూస్తే, ముందు వైసీపీ పార్టీలో గెలిచి ఆయన తరువాత తెదేపాకి మారడం, తరువాత పార్లమెంటులో ఆయన గూర్చి రెండుసార్లు చర్చలు జరగడం, ఆయన సమయానుకూలంగా మాటలు మార్చడం తెలిసిన విషయమే.

అయితే చివరికి అదే పార్టీలో ఉన్నట్లు చెప్పిన ఆయన ఈ ఎన్నికల గాలి వైసీపీ వైపు మల్లడం గమనించి జగన్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అక్కడ చోటు లభించకపోవడం తో మళ్లీ జనసేన లో చివరికి చేరారు. పవన్ ముందే ఒక సారి గేదెల శ్రీనివాస్ చేసిన మోసాన్ని తట్టుకోలేక అదే టికెట్ ను లక్ష్మీ నారాయణ కు ఇచ్చి అతను అవకాశవాద రాజకీయాలకు దూరం అని తెలియజెప్పారు. అయితే ఎస్పీవై రెడ్డి సంగతి తెలిసి కూడా పెద్దరికాన్ని కాదనలేక టికెట్ ఇవ్వడం జరిగింది.

తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా ఎస్పీవై కుటుంబ సభ్యులతో ఆయన కలవగా, బాబు వారి కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది. దీనితో ఈయన అంటే కనీస అభిమానం ఉన్న వారు కూడా అసహ్యించుకునే పరిస్థిత ఏర్పడింది. మరో వైపు పవన్ రియాకషన్స్ ఎలా ఉండబోతున్నాయి, తెదేపా - జనసేన కుట్రలో ఈయన అతని పరువు, ఆయన కుటుంబం పరువు మంటకలుపుకున్నారా అన్న విషయం చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: