ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సినీ ప్ర‌ముఖులు స్ప‌ష్టం చేశారు. తాము అందుకే మ‌ద్ద‌తిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, సినీ నిర్మాత అచ్చిరెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ఈ మేర‌కు త‌మ వైఖ‌రిని వెల్ల‌డించారు. ఎందుకు జ‌గ‌న్‌కు అండగా ఉండాలో ప్ర‌క‌టించారు.


సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల కష్టాల గురించి ఆలోచించే వ్యక్తి మనకు కావాలని అన్నారు. అవన్నీ కూడా జగన్ ఆలోచిస్తున్నారని, అందుకే తాము జగన్‌కు మధ్దతు ఇస్తున్నామ‌న్నారు. ``జ‌గన్ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన జగన్‌లో కనిపిస్తోంది. వాళ్ల నాన్నలాగే వైఎస్ జగన్ ఆలోచనలు ఉంటున్నాయి. ఇబ్బందికర పరిస్దితులు ఏర్పడినప్పుడు జగన్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నడవడంలోనే ఆయన పట్టుదల అర్దమవుతుంది. ఆ పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుకోవడం కోసమే చేశారు. పాదయాత్రలో ప్రతి వ్యక్తి కష్టం తెలుసుకున్నారు. చదువు, ఆరోగ్యం ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు చెబుతున్నారు. మాట ఇస్తే మడమతిప్పరు.మాట ఇస్తే వెనకాడరు. ఇలాంటి వ్యక్తి వస్తే సమాజం రాష్ర్టం బాగుపడుతుంది. ప్రజల బాగుకోసం జగన్ కసితో పనిచేస్తున్నారు. ఎలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో జగన్ ఆలోచిస్తున్నారు`` అని అంటున్నారు.


సినీ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ``ప్ర‌స్తుత పరిస్దితులలో జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మంచి ముఖ్యమంత్రి అవుతారు. రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దగల నేత జగన్ మాత్రమే. జగన్ మనలో ఒకరు. అందుకే ప్రజలతో మమేకం అయ్యారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిని ఏ విధంగా ప్రజలు ఆదరించారో ఇప్పుడు ప్రజలు జగన్ గారిని అదే దృష్టితో చూస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం,ముఖ్యమంత్రి కావడం కోసమే కాదు, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో మంచి ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు ఏంకావాలో తెలుసుకున్నవారే ప్రజానాయకుడు అవుతారు. ఇలాంటి యువనేత అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుంది.`` అని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: