గాజువాక ఇపుడు ఏపీలో అందరినీ ఆకట్టుకుంటున్న అసెంబ్లీ సీటు. ఇక్కడ నుంచి సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. దాంతో ఎక్కడ లేని క్రేజ్ ఈ సీటుకు వచ్చేసింది. ఇక పవన్ పోటీతో గాజువాక గాజు గ్లాస్ కధలు బాగా వినిపిస్తున్నాయి ఎక్కడ చూసుకున్నా.


అయితే గాజువాకలో పవన్ గెలుస్తాడా అన్న చర్చ ఒకటి బయల్దేరింది. గాజువాకలో ఈ నెల 21న నామినేషన్ వేసిన పవన్ మళ్ళీ 30న వచ్చారు. రోడ్ షో నిర్వహించి జనాలను పలకరించారు. ఇక పది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా గాజువాకలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న పవన్ తాను ప్రజలకు సేవ చేస్తానని, ఇక్కడే ఉంటానని చెబుతున్నారు. నిజానికి పవన్ని నాన్ లోకల్ గా ఇటు జనం, అటు మిగిలిన అభ్యర్ధులు భావిస్తున్నారు. ప్రచారం కూడా ఆ విధంగానే చేస్తున్నారు. దాంతో జాగ్రత్త పడిన జనసైనికులు ఇల్లు తీసిపెట్టారు.


ఇదిలా ఉండగా గాజువాక హిస్టరీలో ఇంతవరకూ నాన్ లోకల్ అభ్యర్ధి గెలిచిన దాఖలాలు లేవు. ఈ నియోజకవర్గం పూర్వం పెందుర్తిలో భాగంగా ఉండేది. 1978లో ఏర్పాటైన పెందుర్తికి తొలి ఎమ్మెల్యేగా గుడివాడ అమ్మన్న పనిచేశారు. ఆ తరువాత ద్రోణం రాజు సత్యనారాయణ, ఆళ్ళ రామచంద్రరావు, గుడివాడ గురునాధరావు, మానం ఆంజనేయులు, గణబాబు, తిప్పల గురునాధరెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక 2009 ఎన్నికల్లో గాజువాకగా ఏర్పడ్డాక తొలిసారి ప్రజారాజ్యం తరఫున చింతలపూడి వెంకటరామయ్య గెలిచారు. 


2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పల్ల శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక ఇక్కడ బీసీలకు ఇతర కార్మిక వర్గాలకు మంచి పట్టు ఉంది. అటువంటి సీట్లో పవన్ పోటీ అంటే విడ్డూరమే కానీ ఆయన గెలుపుపై అపుడే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పవన్ని గెలిపిస్తే అందుబాటులో ఉంటారా అన్నదే స్థానిక ప్రజల ఆలోచనగా ఉంది. పవన్ కనుక ఈసారి గెలిస్తే నాన్ లోకల్ తొలిసారి జెండా ఎగరేసినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: