లోకేష్ .. మంగళగిరిలో తన కామెడీ షో తో ఇప్పటికే ప్రజలకు కావాల్సినంత వినోదం పంచాడు. అయితే మంగళగిరిలో ఈ కామెడీ షో కు ఇప్పట్లో ఆగే టట్లులేవు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం కుమారుడు లోకేష్ బాబు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి పట్టణ మండల పరిధిలో టీడీపీ నేతలు లోకేష్ బాబు మెప్పు కోసం కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. 


నాలుగైదు సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో పనిచేసే వారిని తీసుకొచ్చి కొత్తగా పార్టీలో చేరుతున్నారంటూ కొత్తగా కండువాలు కప్పి మంగళగిరిలో వైసీపీ ఖతమైందంటూ లోకేష్ బాబు ఫొటోలకు ఫోజులిస్తున్నాడు.. లోకేష్ బాబు సమక్షంలో శనివారం టీడీపీలో చేరినవారంతా ఎంతో కాలంగా టీడీపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలేనని తేలడంతో లోకేష్ బాబు అభాసుపాలయ్యారు.


పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వర్గానికి చెందిన టీడీపీ నాయకులు సైకం మురళి మల్లి బీసీ నాయకుడు నూతక్కి ఏడుకొండలతో పాటు చాలామంది వరకూ  లోకేష్ సమక్షంలో మళ్లీ టీడీపీ కండువా వేసుకోవడం చూసి నియోజకవర్గంలో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వీరంతా తాడేపల్లి జడ్పీటీసీ శైలజారాణి మాజీ ఎంపీటీసీ టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వారు  టీడీపీ నాయకులేనని తేలడంతో టీడీపీ పరువు పోయింది. ముఖ్యమంత్రి కొడుకు మాత్రం వైసీపీ నేతలే చేరారని బీరాలకు పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: