తెలుగు వార్తా ప్రపంచంలో టివి-9 ఒక సంచలనం. తెలుగులో 24 గంటల న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి వార్తాప్రసారాల తీరుతెన్నులనే మార్చేసింది టీవీ9. తదుపరి దేశంలోని అనేక భాషల్లో ప్రసారాలు మొదలు పెట్టిన టీవీ9 గ్రూప్ ఇప్పుడు హిందీ ఛానల్ ను ప్రారంభిస్తోంది. దేశాన్ని మారుద్దాం రండంటూ ముందుకొస్తోంది. జాతీయ స్థాయిలో ‘టీవీ9 భారత్ వర్ష్’ పేరుతో సరికొత్తగా హిందీ నేటి సాయంత్రం నుంచే గాల్లోకి ప్రసారాలు ప్రధాని నరేంద్రమోదీ అమృత హస్తాలతో ఈ కొత్త ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఢిల్లీలో అంగరంగవైభవంగా జరిగింది 
TV9 National Hindi Channel 'Bharatvarsh' launched
టివి-9 గత సీఈఓ రవిప్రకాష్ జాతీయస్థాయిలో మరో సంచలనానికి తెరలేపారు. జాతీయ మీడియా ప్రపంచంలో లో టీవీ-9 అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో హిందీ ప్రసారాలకు అనువుగా ‘టీవీ 9 భారతవర్ష్’‌ను ప్రారంభించింది. ఆదివారం ఢిల్లీ‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని లాంచనంగా ప్రారంభించారు. 
TV 9 Bharat varsh కోసం చిత్ర ఫలితం
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన టీవీ 9 సీఈఓ రవిప్రకాష్, 2019 ఎన్నికల సమయంలో ఎంత బిజీగా ఉన్నా, నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరై, దీనిని ప్రారంభించడం పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. టీవీ-9 ఆవిర్భావం నుంచి చేపట్టిన అనేక కార్యక్రమాలను గురించి ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో ఈ చానల్ "టివి-9 భారతవర్ష్" ను ప్రారంభించడం అభినందనీయమని నరేంద్ర మోదీ అన్నారు.

TV 9 Bharat varsh కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: