ప్రముఖ సినీనటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జయసుధ సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్నారని జయసుధ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమమైనవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని జయసుధ కోరారు. జగన్ 9 ఏళ్లుగా ప్రజల మధ్యే గడిపి..వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. 


కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గని దృఢమైన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని జయసుధ అన్నారు. వైఎస్ జగన్ ను సీఎం చేయడం మన బాధ్యత ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఏవీ కూడా అమలు చేయలేకపోయారన్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సినిమా రంగానికి మాత్రం ఏమీ చెయ్యలేదన్నారు. ప్రస్తుతం సినీ రంగానికి చెందిన వారిలో 80శాతం మంది జగన్‌కు మద్దతిస్తున్నారని జయసుధ చెప్పారు.


ప్రస్తుతం సినిమారంగానికి చెందిన వారిలో 80 శాతం మంది వైఎస్ జగన్‌కు మద్దతు ఇస్తున్నారని జ‌య‌సుధ చెప్పారు. కేసీఆర్ ఒత్తిడి చేస్తే సినిరంగానికి చెందిన వాళ్లు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, సినీ రంగానికి చెందిన వ్యక్తులు వారు మనస్పూర్తిగా ఇష్టపడితేనే ఎవరికైనా మధ్దతు ఇస్తారన్నారు. తెలంగాణపై పవన్ క‌ళ్యాణ్‌ వ్యాఖ్యలు నిజం కాదన్నారు. రాజకీయాల కోసం ఒక రాష్ట్రంపై నిందలు వెయ్యడం సరికాదని, .తెలంగాణాలోని ఆంధ్రప్రజలమంతా సంతోషంగా ఉన్నామ‌న్నారు. రాజకీయాల్లో పవన్, చంద్రబాబుని ఫాలో అవుతున్నారని జ‌య‌సుధ పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ కల్యాణ్ తిరిగి చెబుతున్నారని మండిప‌డ్డారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: