విజయవాడ ఈస్ట్.. కృష్ణా జిల్లాలోనే హాట్ సీట్ ఇది. అందరి కళ్లూ ఈ నియోజకవర్గంవైపే ఉంటాయి. గతంలో వంగవీటి రంగా వంటి రాజకీయ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. మరి ఈసారి ఈ విజయవాడ ఈస్ట్ ఎవరి పరం కానుందో చూద్దాం.. 


టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ రావు..ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరోసారి ఆయనే బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి భావ కుమార్ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి బత్తిన రవి పోటీ చేస్తున్నారు. ఇది ప్రధానంగా కమ్మ- కాపు సామాజిక వర్గాల ఘర్షణలకు నిలయమైన ప్రాంతం. 

సహజంగా ఇక్కడ కమ్మ వర్గీయులు తెలుగుదేశం వైపు, కాపు వర్గీయులు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గడం మొదటి నుంచి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్‌ రావు.. కాపు వర్గీయుడైన వంగవీటి రాధాకృష్ణపై నెగ్గారు. సో.. ఇప్పుడు రెండు వర్గాలు ఒక్క వైపే ఉన్నట్టు కనిపించడం గద్దెకు బలమైన అంశంగా మారింది. 

ఐతే.. ఇక్కడే ఇంకో ట్విస్టు ఉంది. టీడీపీ నుంచి గతంలో ఇక్కడ గెలిచి మళ్లీ టికెట్ ఆశించిన యలమంచిలి రవి అసంతృప్తితో పార్టీ వీడారు. వైసీపీలో చేరారు. భావకుమార్ గెలుపే తన లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి వంగవీటి రాధా చేరికతో కాపు ఓట్లన్నీ టీడీపీకి బదిలీ అవుతాయా.. యలమంచిలి రవి వైసీపీ అభ్యర్థిని గెలిపించగలుగుతారా.. అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: