2014లో టీడీపీ ప్రభంజనంలో ఆ మూడు జిల్లాలు ముఖ్య భూమికను పోషించాయి. అవే.. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి. ఎక్కడో ఉన్న అనంతపురం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాల్లో స్వీప్‌ చేసింది. మిగతా జిల్లాల్లో తెలుగుదేశం ప్రభంజనం ఏమీలేకపోయినా.. ఈ మూడుజిల్లాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం రేపింది.


స్వీప్‌ చేసి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కేవలం అతి తక్కువ సీట్లకు పరిమితం చేసి ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గట్టి విజయం సాధించింది. ఇదంతా గతం. ఇక ఇప్పుడు ఎలా ఉంటుంది? అనేదే ఇప్పుడు ప్రశ్న, చర్చ! అప్పుడు అద్వితీయ విజయం సాధించిన జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ ఊపులేదు అని ఒకేమాటలో తేల్చేయడానికి అవకాశం ఇస్తున్నాయి పరిస్థితులు. ఒకసారి స్వీప్‌ చేసిన తర్వాత మరోసారి అదేస్థాయి విజయాన్ని సాధించడం ఏ రాజకీయ పార్టీకి అయినా సాధ్యం అయ్యేదికాదు.


అందుకు తెలుగుదేశం పార్టీ కూడా మినహాయింపు కాదని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. అప్పుడు సాధించిన విజయాన్ని రిపీట్‌ చేయడంకాదు కదా, అప్పుడు స్వీప్‌ చేసిన ఆ మూడు జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తు అయిపోతే పెద్దగా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంపై గుత్తాధిపత్యాన్ని కల్పించిన ఆ మూడుజిల్లాలూ అప్పుడు గతానికి పూర్తి విరుద్ధమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: