నారా భువనేశ్వరి.. చంద్రబాబు భార్యగా తెలుగు ప్రజలకు పరిచయమైన పేరు. అంతే కాదు.. హెరిటేజ్ ఫుడ్స్  సంస్థను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన మహిళా పారిశ్రామిక వేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎంత రాజకీయ కుటుంబమైనా ఆమె పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. 


కానీ ఇప్పుడు ఆమె మొదటిసారి రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలతో బిజీగా ఉంటే.. ఆయన సొంత నియోజకవర్గంపై నారా భువనేశ్వరి దృష్టి సారించారట. కుప్పం చంద్రబాబుకు కంచుకోట అన్న సంగతి తెలిసిందే. 

ఎంత కంచుకోటయినా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశ్యంతో కుప్పం బాధ్యతలు నారా భువనేశ్వరి తీసుకున్నారట. ఆమె ఇప్పుడు కుప్పం నేతలతో విజయవాడ నుంచే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. 

సార్ చాలా బిజీగా ఉన్నారు. అందుకే  నేను మాట్లాడుతున్నాను. ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పండి.. కలసికట్టుగా ముందుకు వెళ్లండి.. ఈసారి చంద్రబాబుగారి మెజార్టీ ఇంకా పెరగాలి.. అంటూ పార్టీనేతలు ఉద్బోధ చేస్తున్నారట. మొత్తానికి రాజకీయ బాధ్యతలు కూడా పంచుకుంటూ అర్థాంగి అనిపించారు మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: