ఒక వూరికో రాజు మరో వూరిలో పాలేరు అంటారు. వారు అందరికీ తెలిసినా వారైతే పోనీ ఏదో మంచి మాటలు చెప్పడానికి వచ్చారనుకోవడానికి. కానీ వచ్చిన వారంతా వారి రాజ్యాల్లో నానా అవస్థలు పడుతున్న వారే. ఇపుడైతే అందరికీ ఒకే పాయింట్ కలిపింది. మోడీ వ్యతిరేకతతో వూగిపొతున్న ఈ సేఎమ్ లు  కీలకమైన ఎన్నికల ఏపీలో లేని శత్రువుని పట్టుకుని దడదడలాడించేశారు.


మమతాబెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఎంత బాగా పాలిస్తున్నారో తెలియదు కానీ సీబీఐ అధికారులను  అక్కడ   అరెస్ట్ చేయించి తన నియంత పాలనను లోకానికి  చాటుకున్నారు. ఆ విధంగా అందరికీ తెలిశారు. మమతకు అక్కడ బీజేపీతో పోటీ ఉంది. పైగా ఆమె రేపటి రోజున దేశ ప్రధాని కావాలనుకుంటున్నారు. ఆమె బలమైన ప్రాంతీయ నాయకురాలే తప్ప జాతీయ నాయకురాలు కాదు, ఆమెను విశాఖ తీసుకువచ్చి చంద్రబాబు మద్దతుగా మాట్లాడమంటే ఆమె ఏం చెబుతారు, మోడీని నానా రకాలుగా తిట్టేసి వెళ్ళిపోయారు. ఏపీలో మోడీకి ఈసారి ఎక్కడ చాన్సుందని, మమత గొంతు చించుకుంటే ఫలితం ఏముంది.


ఇక డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే నుంచి బలం లాగేసుకుని డిల్లీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక ఆయన పాలనలోనే అనేక రకాలుగా అవినీతి కధలు వినిపిస్తున్నాయి. పైగా మోడీతో అనవస‌రంగా గిల్లి కజ్జాలు పెట్టుకునే రకం అని పేరు తెచ్చుకున్నారు. ఆయన మోడీకి వ్యతిరేకి. అందువల్ల విశాఖ సభలో ఘాటుగా మోడీని తిట్టేశారు. వీరంతా చంద్రబాబు తమకు తోడుగా ఉంటే ఏదో చేస్తామని చెబుతున్నారు. కానీ ఏపీలో పొలిటికల్ సీన్ వారికి అర్ధం కావడం లేదంటున్నారు. మొత్తానికి ఇద్దరు సీఎం లను విశాఖ తీసుకువచ్చి మోడీని తిట్టించి ఎన్నికల వేళ చంద్రబాబు ఏం లాభం పొందాడన్నదే  ఇక్కడ చర్చ.


మరింత సమాచారం తెలుసుకోండి: