ఏపీలో ఎన్నికల్లో పై చేయి కోసం సాగుతోంది భీకరమైన పోరు. ప్రచార పర్వం వూపందుకున్న వేళ అనుకూల పవనాలు తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు నాన పాట్లు పడుతున్నాయి. చివరి రోజులు కీలకం కాబట్టి జనాభిప్రాయం మార్చాలని తెగ తాపత్రపడుతున్నాయి.


అందులో భాగంగా విశాఖ ఏర్పాటు చేసిన టీడీపీ సభ చంద్రబాబును గ్రాఫ్ ని ఒక్కసారిగా రిగా   పెంచేస్తుందని తమ్ముళ్ళు గట్టి ఆశలే పెంచుకున్నారు. అయితే గ్రాఫ్ మాట దేముడెరుగు అసలు ఆ మీటింగ్ ఎందుకు పెట్టారో అర్ధం కాక తమ్ముళ్ళు చివరకు తలలు పట్టుకున్నారు. ముతక బెంగాళీ హిందీలో  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెసిన ప్రసంగం తమ్ముళ్ళకు అర్ధమైతే ఒట్టు,  పైగా ఆమె మాటల్లో మోడీ మోడీ అని వచ్చింది తప్ప జగన్ గురించి ఒక్క విమర్శ లేదు. దాంతో ఖంగు తినడం బాబు వంతు అయింది. మమత సైతం జాతీయ సర్వేలు గమనిస్తున్నారని, ఏపీలో గాలి జగన్ కి అనుకూలంగా ఉందని గ్రహించారని అంటున్నారు. 


అందువల్లనే ఆమె ఏపీ రాజకీయాల జోలికి వెళ్ళకుండా మోడీని నానా మాటలు అనేసి ప్రసంగం ముగించారని అంటున్నారు. మమత ఏపీలో బాబే గెలుస్తాడని గానీ, ఆయన గాలి ఉందని కానీ ఎక్కడా చెప్పకపోవడం విశేషం. పైగా బాబుకు గట్టి ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ని పల్లెత్తు మాట అనలేదు. ఈ పరిణామాలు బట్టి చూసుకుంటే రేపటి రోజున  కేంద్రంలో అధికారంలోకి రావాలంటే  జగన్ మద్దతు తప్పనిసరి అని మమత భావించి తెలివిగా జగన్ని ఏమీ అనకుండా మొత్తం ఫోకస్ మోడీ మీద పెట్టారని అంటున్నారు.
ఆమెను తీసుకువచ్చి తన గురించి గొప్పగా మాట్లాడించుకోవాలని, జగన్ని నాలుగు తిట్టించాలని భావించిన బాబుకు కూడా నిరాశే మిగిలింది. మొత్తానికి విశాఖ సెంటిమెంట్ సభ ఈసారికి  హిట్ కాలేదు సరికదా నీరసం తెప్పించిందని తమ్ముళ్ళు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: