జనసేనాని మాటల్లో గందరగోళం, అయోమయం పోలేదు. ఆయన ఎవరిని విమర్శించాలో తేల్చుకోలేని కంఫ్యూజన్ నించి వచ్చిన పడిన గొడవ ఇది. గత ఏడాది మార్చిలో గుంటూర్లో  ఓ స్థాయిలో రెచ్చిపోయిన పవన్ టీడీపీని ఎండగట్టారు. ఐతే ఇపుడు ఎందుకో ఆ గొంతు పేలవంగా మారిపోయింది. పైగా అధికార పార్టీ అవినీతిని జనరలైజ్ చేయడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.


శ్రీకాకుళం, గాజువాల్లో పవన్ చెసిన ప్రసంగాలు చూస్తే అదే కనిపిస్తోంది. ప్రభుత్వ పనుల్లో లంచాలు, అవినీతి అంటూ పవన్ గట్టిగానే మాట్లాడారు. దారికి వచ్చారేమో అనుకునేంతలో పవన్ అధికార పార్టీ, ప్రతిపక్షం కుమ్మక్కై లంచాలు బొక్కేస్తున్నారని అనడం విశేషం. అసలు ఏపీలో అధికార పార్టీ విలయతాండవం చేస్తోందని కదా కాగ్ నుంచి అన్ని నివేదకలు  చెప్పుకొచ్చింది. పైగా గ్రామల్లో జన్మ భూమి కమిటీల పెత్తనం దారుణంగా ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి.


వాటిని ప్రస్తావించని పవన్  అధికార పార్టీకి 60 శాతం, ప్రతిపక్షానికి నలభై శాతం అవినీతిలో వాటా ఉందని తన లెక్కలు తేల్చేశారు. అసలు ఎక్కడ విపక్షానికి అవకాశం ఇచ్చింది టీడీపీ సర్కార్. వారు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా ఓడిపోయిన వారిని ఇంచార్జిలుగా చేసి గెలిచిన ఎమ్మెల్యేను డమ్మీని చేసి పాలన చేశారు. అటువంటిది విపక్షానికి వాటాలు, అధికారాలు అంటూ పవన్ కొత్త  కధలు చెప్పడమేంటని సెటైర్లు పడుతున్నాయి. అధికార పార్టీని విమర్శించాల్సి వచ్చినపుడు విపక్షాన్ని కూడా కలిపేయడం పవన్ మార్క్ రాజకీయం అయిపోయిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: