ఇప్పటికే రైతుబంధు, మిషన్ భగీరథ వంటి పథకాలతో దేశంలోనే పేరు తెచ్చుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆయన సంచలనం సృష్టించబోతున్నారట. రెండు నెలల్లో దేశానికే ఆదర్శంగా ఉండే రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నారట. 


ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ చట్టం వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అమల్లో ఉన్న "గ్యారంటీడ్ టైటిల్ డీడ్" చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేయబోతున్నది. దేశంలో ఈ ప్రయోగానికి, సంస్కరణకి తెలంగాణ వేదిక కానుంది. 

అంటే ఇక నుంచి రాజ్యమే భూమికి సంబంధించి పూచీకత్తుగా ఉండబోతోంది. ఈ దెబ్బతో భూమి యజమానులు, ప్రధానంగా రైతుల కడగండ్లు తీరినట్టే. వీఆర్వోల దరిద్రపుగొట్టు అవినీతి దందాల ప్రయత్నాలకు అడ్డుకట్ట పడ్డట్టే. 

ఇప్పుడు టెక్నాలజీ సాయంతో, ఉత్తమ పరిపాలన పద్ధతుల ఆడాప్షన్ వల్ల భూపాలన కొత్త పుంతలు తొక్కనుంది. కర్షకులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఏదేమైనా భూమి అసలు యజమానులకు మేలు జరిగితే అంతకు మించి కావల్సిందేముంది..?



మరింత సమాచారం తెలుసుకోండి: