నిన్న కృష్ణ జిల్లా గన్నవరంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ 'కాంగ్రెస్ భరోసా సభలో 'మాట్లాడుతూ, హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అంటు ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అబద్దాలు చెప్పి 2014లో ఓట్లు దండుకున్నారని  విమర్శించారు. దేశానికి నిరుద్యోగం పెద్ద సమస్యలా మారిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు దేశంలో ఉన్నారని, పేదలకు ప్రతి నెల నేరుగా రూ.6వేలు బ్యాంకులో వేస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

తాను మోడీలా అబద్ధాలు చెప్పే  మనిషిని కాదని రాహుల్ అన్నారు.  నిరుపేదలకు ఏడాదికి రూ.72వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు.కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. ఏపీలో అధికారంలోకి వస్తే  రెండు రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

ఎలాంటి షరతులు లేకుండా పరిశ్రమలకు అనుమతిస్తామని, యువకులు వ్యాపారాలు పెట్టాలనుకుంటే మొదటి మూడేళ్ల వరకు పర్మిషన్‌ అవసరం లేదని రాహుల్‌ అన్నారు.  ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెడతామని రాహుల్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: