లోక్ నీతి, సిఎస్ డిఎస్ సర్వే పేరుతో చంద్రబాబునాయుడుకు మద్దతిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం అంగా భోగస్సే అని తేలిపోయింది. జాతీయ మీడియా ఇప్పటి వరకూ చేసిన సర్వేల్లో వైసిపికే స్పష్టమైన పట్టం కట్టాయి. దాంతో చంద్రబాబు అండ్ కోలో బెదురు మొదలైంది. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న తర్వాత క్షేత్రస్ధాయిలోని వాస్తవాలతో టెన్షన్ పెరిగిపోతోంది.

 

అందుకనే టిడిపి నేతల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు మీడియా ఓ భోగస్ సర్వేను ప్రచురించింది. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో టిడిపికి 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని తేల్చేసింది. అలాగే 25 ఎంపి సీట్లలో 18 నుండి 22 దాకా వచ్చే అవకాశం ఉందని సదరు సర్వే సంస్ధలు చెప్పినట్లు ఊదరగొట్టింది. నిజానికి సదరు మీడియాలో ప్రచురితమైన కథనంపై ఎవరికీ నమ్మకం లేదు.

 

అయితే కథనం ప్రచురితమైన రోజు మధ్యాహ్నానికి ఆ సర్వే అంతా ఉత్త భోగస్ అని తేలిపోయింది. లోక్ నీతి, సిఎస్ డిఎస్ సంస్ధల తరపున వెంకటేశు ట్విట్టర్లో స్పందించారు. తమ సర్వేగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ సర్వే అంతా భోగస్ అని కొట్టిపాడేశారు.

 

అంటే అందరి నిజం కొద్ది గొంటల్లోనే నిజమని తేలిపోయింది. నిజానికి ఎన్నికలు మరో పదిరోజుల్లో పెట్టుకుని ఇటువంటి భోగస్ సర్వేలను ప్రచురిస్తే జనాలు నేమ్మేస్తారని ఎలాగ అనుకున్నారో వాళ్ళకే తెలియాలి. భోగస్ సర్వే ఫలితాలను ప్రచురించే స్ధాయికి సదరు మీడియా దిగజారిపోయిందంటే అసలు వాస్తవం ఎలాగుండబోతోందో అందరికీ అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: