ఆదేశాలిచ్చిన చంద్రబాబునాయుడు బాగానే ఉన్నారు. బదిలీపై వెళ్ళిపోయిన మాజీ ఐబి చీఫ్ ఏబి వెంకటేశ్వరరావూ బాగానే ఉన్నారు. మధ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేథా మాత్రం ఇరుక్కుపోయారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ముందు నిలబడి గంటపాటు సంజాయిషీ ఇచ్చుకోవాల్సొచ్చింది పాపం. ఇపుడు తనపై సిఈసి ఏమి చర్యలు తీసుకుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది పునేథాలో.  

 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈమధ్యనే ఐబి చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. సిఈసి ఆదేశాల ప్రకారం ఏబితో పాటు మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తు పునేథా జీవో కూడా జారీ చేశారు. అయితే మరుసటి రోజు తెల్లవారేసరికల్లా ఏబి బదిలీని రద్దు చేస్తు రెండో జీవో విడుదలైంది.

 

అంతేకాకుండా ఏబి బదిలీని సవాలు చేస్తు ప్రభుత్వం ఏకంగా కోర్టుకు కూడా వెళ్ళింది. దాంతో ప్రభుత్వం చర్యలు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, సిఈసి ఆదేశాలపై ఇంత వరకూ ఏ రాష్ట్రప్రభుత్వం కూడా కోర్టుకెక్కింది లేదు. సిఈసి ఆదేశాలను పాటించటమే తప్ప ధిక్కరించింది కూడా లేదు.

 

కానీ అందుకు విరుద్ధంగా ఏపిలో రెండూ జరిగాయి. ఐబి చీఫ్ ఎన్నికల కమీషన్ పరిధిలోకి రాదనే అడ్డుగోలు వాదనతో ప్రభుత్వం కోర్టులో కేసు వేయటం దేశంలోనే సంచలనంగా మారింది. నిజానికి ప్రభుత్వం వేసిన కేసు నిలవదని అందరికీ తెలుసు. అయినా తెరవెనుక నుండి వచ్చిన ఆదేశాలతోనే పునేథా కోర్టుకెక్కారు.

 

సరే జరిగిందంతా విచారించిన కోర్టు ప్రభత్వం మాడు పగలగొట్టిందినుకోండి అది వేరే సంగతి. సిఈసి ఆదేశాలను పాటించటం తప్ప ప్రశ్నించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టంగా చెప్పటంతో ఐబి చీఫ్ ను వెంటన బదిలీ చేసింది. ఇంతకీ తెరవెనుక ఏం జరిగిందంటే చంద్రబాబు ఒత్తిడితోనే పునేథా రెండోసారి జీవో ఇచ్చారట. అంతేకాకుండా కోర్టుకు వెళ్ళటంలో కూడా చంద్రబాబు ఒత్తిడే కారణమని సమాచారం. ఆదేశాల ధిక్కారంపై  సిఈసి ముందు పునేథా దోషిగా నిలబడాల్సొచ్చింది.  తెర వెనుక జరిగిన విషయాలను పునేథా సిఈసికి వివరించారని సమాచారం. మరి ధిక్కార చర్యలపై సిఈసి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: