no of jobs going to be fulfilled by jagan కోసం చిత్ర ఫలితం

ఐదేళ్లు వెనక్కివెళితే, 2014ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత చంద్ర బాబు నోటి నుంచి వచ్చిన ప్రధాన హామీల్లో: 

“బాబు వస్తే జాబు వస్తుంది” అని. 
“ఏపీలోని ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటాను”అని, వారికి అండగా నిలుస్తానని మాట ఇచ్చే వారు. 
“ప్రతి కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించటం పక్కా” అని వందలాది ఆశలు కల్పించారు. 

no of jobs going to be fulfilled by jagan కోసం చిత్ర ఫలితం


2014లో టీడీపీ గెలుపులో ప్రధాన వాటాగా చెప్పాల్సింది “బాబు నోట వచ్చిన జాబు మాట” అంతే కాదు విజయానికి అదే కారణంగా చెప్పాలి. అలాంటి అత్యంత ప్రధానమైన హామీని తన గత ఐదేళ్ల పాలనలో బాబు “పక్కన పెట్టేసిన తీరు” పట్ల రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న మాటను నమ్మామని  అయితే నిజంగా జరిగిందేమంటే ఆ హామీని చంద్రబాబు తన ఇంటి వరకు మాత్రమే అమలు చేసు కున్నారంటూ బహిరంగంగానే మండిపడు తున్నారు.  జాబు విషయంలో మాత్రం ఏపీ యువతలో అసంతృప్తి అవధులు దాటింది.  
no of jobs going to be fulfilled by jagan కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు ఏ విషయంలో వైఫల్యం చెందారో అదే విషయాన్ని వైఎస్ జగన్ పలు మార్లు ప్రస్తావిస్తున్న తీరు రాష్ట్ర యువతలో కొత్త ఆశలు చిగిర్చేలాగా  చేస్తున్నాయి. 
తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చేసిన ప్రకటన ప్రత్యర్థి పార్టీకి  ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఒకే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ కార్యక్రమం చేపడతామన్నారు. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం ఇందులో నిజమెంత? ఆనుకునే వారికి ఒక ప్రక్క అపుడేమైంది అంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్ధానాలు గుర్తుకు రాగా – అలాయేం జరగదు వైఎస్ జగన్ మాట యిస్తే అది విధాత రాతే నన్న విషయం భరోసా కలిగించుతుంది. 


no of jobs going to be fulfilled by jagan కోసం చిత్ర ఫలితం

పవర్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల పైన దృష్టి పెడతామన్న జగన్ మాట టీడీపీ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మారింది. ఎందుకంటే వారికీ తెలుసు జగన్ ఇచ్చిన మాట తప్పడని. ఆందుకే వారందరికి గుండేదడ.  
no of jobs going to be fulfilled by jagan కోసం చిత్ర ఫలితం
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందేలా రాష్ట్రంలో చట్టం చేస్తామని ఇస్తున్న హామీ కూడా ఉద్యోగ హామీకి ఊతం ఇవ్వటంతో ఈ విషయం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.  తాజా ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాల విషయమై జగన్ చేస్తున్న కీలక ప్రకటన తెలుగుదేశం పార్టీ పాలిట శాపంగా మారుతుందన్న భయాందోళ నలు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: