అనంతపూర్ జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో ఎన్ టీవీ నిర్వహించిన ప్రజా పాల్ యాత్రలో భాగంగా కొన్ని విభిన్న అభిప్రాయాలు ప్రజానీకం నుండి వ్యక్తమయ్యాయి. ముందుగా ఇప్పుడు కదిరి ఎమ్మెల్యేగా ఉన్న చాంద్ బాషా వైసీపీ పార్టీ నుండి గెలిచి తెదేపా లోకి మారారు. ఆయన పని తీరు పట్ల కదిరి ప్రజలు పెద్ద సంతృప్తి చెందినట్లు కనిపించలేదు. పార్టీలో కొమ్ములాటలు కారణంగా వారు నియోకవర్గక అభివృద్ధిని పెడ చెవిన పెట్టారు అని కొందరు ఆరోపించారు.

ఇక పోతే మరీ ముఖ్యంగా అందరూ చెప్పిన విషయం అయితే నీటి సమస్య. గ్రామాల్లో మరీ దారుణంగా పరిస్థితి తయారైందని చాలా మంది అన్నారు. ఒక రైతు అయితే పాపం నీరు లేక ఈ ఏడాది పంట వేయడం నిలిపివేశాడంటే అక్కడ పరిస్థిత అర్థం చేసుకోవచ్చు. టీచర్లకు కూడా వారి సెక్టార్ లలో పెద్దగా మేలు ఏమీ జరగలేదు అని చెప్పుకొచ్చారు.

ఈ సారి ఎన్నికలకు తెదేపా నుండి కందికుంట వెంకట ప్రసాద్ బరిలోకి దిగాడు. అయితే వైసీపీ మాత్రం చాకచక్యంగా పీ.వీ సిద్దారెడ్డినీ బరిలోకి దింపి గట్టిపోటీ ను ఇవ్వటమే కాకుండా దాదాపు ఇక్కడ ప్రజలంతా మళ్లీ వైసీపీ కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: