ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు హల్ చల్ చేయడం కామన్. అయితే ఒక సంస్థ పేరిట హల్ చల్ చేసిన సర్వే .. తీరా ఏప్రిల్ ఫూల్ అనేసింది. సరిగ్గా ఏప్రిల్ ఒకటో తేదీన ప్రచురించారు తెలుగుదేశం పార్టీ గెలిచేస్తోందని! ఆ సర్వేకు ఒక పేరున్న సంస్థ పేరును కూడా వాడేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి నూటా ఇరవై ఆరు సీట్లకు తగ్గవని తేల్చేసిందా మీడియా సంస్థ. తోక మీడియాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆ సంస్థ లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే అంటూ తనకు తోచిన నంబర్లను వేసేసుకుంది.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేయడం కూడా వేస్టే అని ఈ సర్వే తేల్చేసిందని తోక మీడియా ప్రకటించేసింది. అంతేకాదట.. తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలుస్తుందో ఆ సంస్థ ‘సునిశిత’ విశ్లేషణ చేసిందట! ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయాన్నే ఇలాంటి కథనంతో పలకరించింది ఆ మీడియా. తీరా మధ్యాహ్నానికే అది ఏప్రిల్ ఫూల్ సర్వే అని తేలిపోయింది. ఈ విషయాన్ని సదరు లోక్ నీతి-సీఎస్డీఎస్ ప్రకటించింది.


ఏపీ ఎన్నికల విషయంలో తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, తమ పేరుతో సాగుతున్న సర్వే ప్రచారం అంతా అబద్ధమే అని ఆ సంస్థ తేల్చిచెప్పింది. ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అధికారికంగా ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసింది. ఇలా దొరికిపోయింది సదరు తోక మీడియా. తెలుగుదేశం పార్టీ గెలిచేస్తోందని ప్రచారం చేయడానికి సరిగ్గా ఏప్రిల్ ఫూల్ ముహూర్తాన్ని ఎంచుకుంది. ఈ ప్రచారం మధ్యాహ్నానికే బెడిసికొట్టింది. సైకిల్ పార్టీకే కాదు, సైకిల్ మీడియాకూ కష్టాలొచ్చినట్టున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: