"జపాన్‌ ప్రజలు ఘనంగా  జరుపుకునే  ఉత్సవం  - కనమార మాట్సురి, హనెన్ సాయ్ జపాన్ బాషలో "ఫెస్టివల్ ఆఫ్ ఫాలస్" తెలుగులో లింగమహోత్సవం" గా  చెప్పవచ్చు.  ఆ రోజు అక్కడ ఏ వస్తువు చూసినా పురుషాంగం అంటే లింగాలనే గుర్తుకు తెస్తాయి. తినే ఆహారం నుంచి వారు పెట్టుకునే టోపీల వరకు ప్రతి ఒక్కటీ “పురుషాంగాల రూపం- లింగ రూపం" లోనే ఉంటాయి. ఏటా మార్చి నెల రాగానే జపాన్‌ లోని ‘హొన్షు ఐల్యాండ్ ‘ ఈ పండుగకు సిద్ధమై పర్యాటకులతో కిటకిట లాడు తుంది. 
 
అక్కడ “నొయగా నగరం”లోని ఐచీ ప్రాంతంలో కొయ్యతో తయారు చేసిన రెండు మీటర్ల పొడవైన పురుషాంగం ప్రతిమ- ఒక లింగ రూప మూర్తిని పూజించే పవిత్ర దేవాలయం వద్ద ఊరేగిస్తారు. ఈ సందర్భంగా అంతా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేడుకలో పాల్గొంటారు. 
సంబంధిత చిత్రం 
సంతానం లేనివారు సంతానం కోసం పరితపించేవారు ఆ పురుషాంగాన్ని ప్రార్థిస్తూ ముద్దు పెట్టు కుంటారు. ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిన కొత్తలో పురుషాంగం ప్రతిమ చాలా చిన్నది గా ఉండేది.  ఏడాదికాయేడు దాని ఆకారాన్ని పెద్దది చేస్తూ ఊరేగించడం ఇక్కడ సాంప్రదాయంగా మారింది. ఈ వేడుకలో భాగంగా అక్కడి ఆహార పదార్ధాలను, కూరగాయలను, అలంకారాలను, బొమ్మలను చాకోలేట్లను, కాండీలను  సైతం పురుషాంగాల రూపంలోనే తయారు చేస్తారు. అరటి పండ్లను చాక్లెట్ రసంలో ముంచి విక్రయిస్తారు. 
 
యువతులు సైతం చిన్న పురుషాంగాల ప్రతిమలను పసిపాపలను ఎత్తుకున్నట్లు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొంటారు.  జపాన్‌ లో సంతాన సమస్యలు ఎక్కువ.  పిల్లల కోసం దంపతులు పరితపించే సంఘటనలు కోకొల్లలు. 
 
సంతానం లేని వారు ఈ వేడుకలో పాల్గొని, ప్రతిమను ముట్టుకుంటే, ముద్దు పెట్టుకుంటే వారికి సంతానం కలిగి తప్పకుండా కోరిక నెరవేరుతుందని విశ్వాసం. అలాగే వెలయాళ్ళు కూడా ఈ పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఉత్సవంలో పాల్గొంటారు. ఫలితంగా  శృంగార సంభంధ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని వారి నమ్మకం.  
festival of steel phallus kawasaki japan కోసం చిత్ర ఫలితం 
ఈ నేపథ్యంలో తగట పుణ్యక్షేత్రంలో ఈ “హనెన్ సాయ్-కనమార మాట్సురి”పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం, మొదటి ఆదివారంనాడు అంటే ఈ ఏడాది ఏప్రిల్ ఏడవ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 
festival of steel phallus kawasaki japan కోసం చిత్ర ఫలితం
అసలు కథ యేమంటే సంతానలేమికి కారణం – అసూయతో యువతుల జననాంగాల్లో పదునైన పళ్ళున్న భూతం దాగి ఉండి సంభోగ సమయంలో ఆ యువతి యోని లోకి ప్రవేసించిన పురుషాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని దాని నివారణ కోసం యువతులు కమ్మరిని కలసి ఒక బలమైన ఉక్కు పురుషాంగాన్ని తయారు చేయించుకొని సంభోగించి దయ్యాన్ని సమ్హరిన్షే నమ్మకం. ఈ పండుగ నిర్వహణ 1969 తో ప్రాభైంచారు. ఇప్పుడు ఇది ఒక మహోత్సవంగా మారి పర్యాటక ఆదాయంతో  "ఏయిడ్స్ లాంటి శృంగార సంభంద వ్యాధులు" నివారణ కు ఆర్ధిక సహాయం ఇతోధికంగా  అందిస్తుంది.  
 festival of steel phallus kawasaki japan కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: