రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలు తారా స్థాయికి చేరుతున్నాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ పై విమర్శ వర్షం గుప్పించారు.ఆయన మీడియతో మాట్లాడుతూ ఇదేమి పాలెగాళ్లు పాలించే రాజ్యం అనుకుంటున్నారా బాలకృష్ణ అంటూ అతని పై మండి పడ్డారు.

ఇది అప్రజాస్వామిక పాలన నడుపుతున్నరా అంటూ ఏకిపారేశారు. ప్రజలు తనని ఎన్నుకున్నారని ఆ విషయాన్ని ఆయన మర్చిపోకుడదు అంటూ గుర్తుచేశారు.ఆయనకు పాలన చేతకాకపోతే వెళ్లి సీనిమాలు చేసుకోవాలని, తను రాజకీయాల్లో ఉండడం ప్రజలకు ఆటకం అంటూ హితవు పలికారు. తను ఒక రాజకీయ నేతగా వ్యవహరించడం లేదని, రాజరిక రాజ్యం చేస్తున్న అంటూ బాలకృష్ణ ఫీల్ అవుతున్నారు అంటూ ఆయన అన్నారు.

బాలకృష్ణ పర్మిషన్ లేకుండా ఎంపీలు, మంత్రులు రాకూడదా అంటూ ఆయన ప్రశ్నించారు.ఈసారి ఎన్నికల్లో ప్రజలు బాలకృష్ణ కు చరమగీతం పడబోతున్నరు అంటూ జ్యోస్యం చెప్పారు. ఇప్పటికే తన పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈసారి గద్దె దిగడం ఖాయమని అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: