వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ముందస్తు సర్వేలో ముందంజలో ఉన్నట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. దానికి గల ముఖ్యకారణం ఆయన ఇస్తున్న హామీలలో ఉన్న భరోసా మరియు స్పష్టత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే జగన్ ప్రకటించిన నవరత్నాలు కాన్సెప్ట్ రాష్ట్రంలో పెద్ద హిట్టు. దానిని చూసే చంద్రబాబు కాపీ కొట్టి ఆయన పథకాలు, హామీలు ఇచ్చారు అని అందరి నోట మాట. ఇప్పుడు జగన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొక విన్నూతమైన కొత్త హామీని ప్రజలకు ఇచ్చారు. రాష్ట్రంలో షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, షాపులు ఉన్న ప్రతీ రజక సోదరులకు, షాపులు ఉన్న ప్రతీ టైలర్ సోదరునికి జగన్ అదిరిపోయే హామీ ఇచ్చారు.

ఆయన నెలకు అక్షరాలా పదివేల రూపాయలు నాయీ బ్రాహ్మణులకు, షాపులు ఉన్న ప్రతీ రజక సోదరులకు, షాపులు ఉన్న ప్రతీ టైలర్ సోదరునికి ఇస్తానని మాట ఇచ్చారు. దీనితో వారి ఓట్లన్నీ ఇంకా జగన్ సొంతం అని, ఇప్పటి వరకూ రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు అని రాజకీయ పండితులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: