రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలతో ఒకవేళ జగన్ గనుక అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోతుందని తాడూ బొంగరం లేని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయం తీవ్రమైన చర్చకు దారి తీసింది. దీనిపైన రాజకీయ పండితులు చెప్తున్న మాట ఏమిటో చూద్దాం...!

ముందుగా జగన్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి కాదు. కేవలం ఆయన రాజధాని నిర్మాణానికి రైతుల భూములు లాక్కున్నారు అన్న ఒక్క విషయంపై వ్యతిరేక ధోరణి చూపించారే తప్ప ఆయనకు అధికారంలోకి వచ్చాక అమరావతిని కూల్చే ఉద్దేశం లేదు అనేది స్పష్టం. అసలు జనాలు రాజధాని మారిస్తే ఎలా ఊరుకుంటారు అని ఇంగిత జ్ఞానం లేకుండా బాబు మాట్లాడడం విశేషం.

ఇక పోతే దాదాపు పోలవరం ప్రాజెక్టు అయిపోయిందని తెదేపా ప్రభుత్వం సంకలు గుద్దుకున్న తరువాత కూడా బాబు ఇలా ఎలా మాట్లాడుతారు అన్నది వీరి వాదన. కాలవలు మొత్తం పూడ్చి, ఆనకట్టలు పడగొట్టడానికి జగన్ తెలివి లేని వాడా లేక ఇలాంటి ఆరోపణలు చేసేందుకు బాబు కి మతి ఉండక్కర్లేదా అని పండితులు అంటున్నారు. కావున జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతికి, పోలవరానికి ఎలాంటి ముప్పు లేదు అని రాజకీయ పండితులు నొక్కి మరీ చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: