ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తెలంగాణాలో కూడా ఉత్కంఠ రేపుతోంది. అందుకనే తెలంగాణా ఇంటెలిజెన్స్ బాగా దృష్టి పెట్టిందని సమాచారం. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా నియోజకవర్గాల్లో పోటీ ద్విముఖమనే చెప్పాలి. అంటే అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపిల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే మధ్యలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా పోటీలో ఉంది.

 

ఇక్కడ సమస్య ఏమిటంటే జనసేన పార్టీని పోటీలో నుండి తీసేసేందుకు లేదు. అలాగని నిర్లక్ష్యం చేసేందుకూ లేదు. ఎందుకంటే, పార్టీ బలమేంటో నిజం చెప్పాలంటే అధినేత పవన్ కు కూడా తెలీదు. పవన్  భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోకవర్గాలను తీసేస్తే మిగిలిన 137 నియోజకవర్గాల్లో పలానా నియోజకవర్గంలో గెలుస్తుందని కచ్చితంగా చెప్పే నియోజకవర్గం ఒకటి కూడా లేదు.

 

జనసేన ఎక్కడ గెలుస్తుందో  చెప్పలేకపోయినా టిడిపి, వైసిపిలకు పడే ఓట్లలో ఎవరి ఓట్లను చీల్చుకుంటుందనేదే సస్పెన్సుగా ఉంది. అందుకనే చాలా నియోజకవర్గాల్లో ఫలితాన్ని విశ్లేషకులు కూడా అంచనా వేయలేకున్నారు. ఇటువంటి సమయంలోనే తెలంగాణా ఇంటెలిజెన్స్ సిబ్బంది విస్తృతంగా సర్వేలు చేశారట.

 

వివిధ ప్రాంతాల్లోని సుమారు 7 వేలమంది యువకులపైనే ఈ సర్వే ప్రధానంగా దృష్టి పెట్టిందట. సుమారుగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని 14 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యావంతులను కేంద్రంగా కూడా సర్వే జరిగిందట. మొత్తం మీద సర్వే ఫలితమేంటంటే వైసిపికే అనుకూలంగా ఉందని సమాచారం.

 

రాబోయే ఎన్నికల్లో వైసిపి కాస్త అటు ఇటుగా 135 అసెంబ్లీ సీట్లను సాధిస్తుందని ఇంటెలిజెన్స్ సర్వేలో స్పష్టంగా తేలిందట. అందుకనే సర్వే ఆధారంగానే కెటియార్ కూడా కాబోయే సిఎం జగన్మోహన్ రెడ్డే అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.  జగన్ సిఎం అవుతారని వెంటనే ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతారని గట్టిగా చెబుతున్నారు. టిడిపికి 30 సీట్లు మిగిలిన సీట్లు జనసేనకు వస్తాయన్నది సర్వే సారాంశమట.


మరింత సమాచారం తెలుసుకోండి: