ఉపన్యాస మరియు మాటకారితనంలో దాదాపు ఎన్టీఆర్ కి రాజకీయాలలో ఎవరూ సాటి రారనే చెప్పాలి. ఆయన పరిపాలనా విషయంలో అంతగా సక్సెస్ కాకపోయినా కేవలం తన మాటలు, ప్రసంగాలతో ప్రజలను తన వైపు తిప్పుకోగల సమర్థులు ఎన్టీఆర్. చంద్రాబునాయుడు పరిపాలన పద్ధతి బాగానే ఉంటున్నా ఆ ఉపన్యాస ధోరణి ఇంకా అవలంభించుకొలేదనే చెప్పాలి.

అయితే ఎన్టీఆర్ తరువాత వెంకయ్య నాయుడు రాష్ట్రంలో అంత ఉనికి లేని బీజేపీ పార్టీ లో ఉండి కూడా తన ప్రసంగాలకు ప్రజలను రప్పించేవారు. అయితే తరువాత వైఎస్ పర్వాలేదనిపించినా బాబు మాత్రం ఆ విషయంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. ఇప్పుడు మోడీ బాబు విఫలం ఆయన చోటే బాబుకి మంచి బిరుదులు ఇస్తున్నారు.

మంచి మాటకారి అయిన ప్రధాని నరేంద్ర మోడీ, బాబుని బాహుబలి లోని భల్లాల దేవ క్యారెక్టర్ తో పోల్చడం విశేషం. చంద్రబాబు భల్లాల దేవునిలా చాటుమాటు రాజకీయాలు, వెనుక కుట్రలు పన్నే నేర్పరి బాబు అని ఆయన పోల్చారు. ఇక్కడ బాహుబలిలో భల్లాలదేవుని పాత్ర పోషించిన రానా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర పోషించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: