వైఎస్ జగన్ సోదరి షర్మిల ప్రచారం మొదలయ్యాక  పొలిటికల్ సీన్ హాట్ హాట్ గా మారుతోంది. షర్మిల ప్రసంగాలకు జనం బాగా కనెక్ట్ అవుతున్నారు. చంద్రబాబు గురించి సూటిగా సుత్తి లేకుండా షర్మిల చేస్తున్న ఘాటు కామెంట్స్ కు తమ్ముళ్ళు షాక్ తింటున్నారు. రిటర్న్ కౌంటర్ ఇచ్చేలోగానే షర్మిల  మరిన్ని బాణాలు వేస్తున్నారు. ఏపీలో అయిదేళ్ల బాబు పాలనను డైరెక్ట్ గానే  ఆమె ఎండగడుతున్నారు. బాబు ఇచ్చిన హామీలను కూడా గుచ్చి గుచ్చి నిలదీస్తున్నారు.


ఇక ఈ రోజు గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో షర్మిల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అటు బాబు పైన ఇటు పవన్ పైనా చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. జనసేన పవనో యాక్టర్ అని, యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్లే చేస్తారని, అలా బాబు మాటలు వింటూ ఆయన రాజకీయ తెరపై చాలా బాగా నటిస్తున్నారంటూ షర్మిల  చేసిన కామెంట్స్ వైసీపీకి హుషార్ తెస్తున్నాయి. అదే విధంగా గతంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇపుడు బయట ఉన్నట్లుగా నటిస్తున్నారని షర్మిల అన్నారు.


జనసేన టీడీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని షర్మిల  ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరుగా వస్తున్నా ఒక్కటేనని కూడా ఆమె అన్నారు. జనసేనకు పొరపాటున ఓటేసినా అది తెలుగుదేశానికి వేసినట్లేనని కూడా ఆమె హెచ్చరించారు. పవన్ బాబు ఇవాళా, రేపూ ఎపుడూ ఒక్కటేనని కూడా ఆమె గట్టిగా చెప్పుకొచ్చారు. మొత్తానికి బాబు వైసీపీ మీద కామెంట్స్ చేస్తూంటారు వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని, దాన్ని రివర్స్ చేస్తూ జనసేనకు వేస్తే టీడీపీకి వేసినట్లేనని షర్మిల అనడం ఇపుడు పెద్దఎత్తున చర్చ‌నీయాంశం అవుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: