జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మార్పు కోసం మరియు ప్రశ్నించడం కోసం అంటూ రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ లకు ధీటుగా జనసేన పార్టీని సామాన్య ప్రజల గుండెల్లో కి తీసుకెళ్లారు.


ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఎంతగానో కృషి చేసిన పవన్ కళ్యాణ్ రాబోతున్న 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా కేవలం వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తన పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల విషయంలో ఎన్నికలను అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీలను ముందుగానే స్టాంపు పేపర్ల పై లికిత పూర్వకంగా అందజేయడం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో మిగతా పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


ముఖ్యంగా క్లియర్ పాలిటిక్స్ చేద్దామని పాలిటిక్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు మరియు పొలిటికల్ విశ్లేషకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి కొత్త ప్రయోగాలను రాజకీయాలలో ప్రజలు రాబోతున్న ఎన్నికలలో ఆదరిస్తారో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: