ఈ రోజు వైసీపీ లోకి చేరిన ప్రముఖ నటులు రాజశేఖర్ మరియు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ వెంటనే జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. ఆమె ఇద్దరూ కుమ్మక్కై, రహస్యంగా పొత్తు పెట్టుకొని జగన్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

దీనికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రాజకీయ పార్టీలు జనసేన అనే ఒక అయిదేళ్ల పిల్లవాడిని ఇలా రెండు పక్కల నుండి దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెదేపా అంటే ఏదో అనుకుంటాం కానీ అటు వైసీపీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుందంటే వారికి తాను ఆ పార్టీతో కలవాలని ఆశ అని అన్నారు. ఇంతకి మునుపే వారు తెలంగాణ నాయకులతో కలిసి తనను పొత్తు కి ఉసిగొల్పారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జీవిత రాజశేఖర్ కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే విమర్శించలేదు. ఆమె మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీని కూడా అన్నారు. నేరుగా పలానా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పని తరుణంలో పవన్ ఇలా అత్యుత్సాహంతో తమ పొత్తును ఖండించడం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆమె అనిన కొద్ది గంటల్లోనే ఇది జరిగిన నేపథ్యంలో పవన్ ఇంకా చాలా నేర్చుకోవాలి అని లేని పక్షంలో అన్న లాగా పార్టీని మధ్యలో వీడాల్సి వస్తుందని ప్రజల మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: