ఈస్ట్ గోదావరి  వెస్ట్ గోదావరి ఈ రెండు జిల్లాలో ఎవరైతే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటారో వారిది విజయమని చెప్పొచ్చు. 2014 లో టీడీపీ ఈ రెండు జిల్లా ల నుంచి క్లీన్ మెజారిటీ ని సంపాదించింది. అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు బాగా పని చేశాయి. పైగా పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంతో టీడీపీ విజయం నల్లేరు మీద నడక అయ్యింది. దానితో జగన్ కు అధికారం చేజారింది. 


అయితే ఈ సారి పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా 2014 లో టీడీపీకి సపోర్ట్ చేసిన జనసేన ఇప్పుడు స్వంతంగా భరిలోకి దిగుతుంది. దీనితో  అక్కడ త్రిముఖ  పోరు నెలకొని ఉంది. పైగా టీడీపీ మీద వ్యతిరేకత కూడా బాగా కనిపిస్తుంది. దీనితో ఈ సారి అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఒక సారి చూద్దాం. 


తూర్పుగోదావ‌రి జిల్లాలోని మొత్తం 19 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 7, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 7 స్థానాల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. ప్ర‌త్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రాజోలు, కొత్త‌పేట‌, రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మొత్తం 15 నియోజ‌క వ‌ర్గాల‌కు గాను వైసీపీ 6, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 4 నియోజ‌క వ‌ర్గాల్లో ట‌ఫ్ ఫైట్ కొన‌సాగునుంది. న‌ర్సాపురం, భీమ‌వ‌రం, దెందులూరు, పోల‌వ‌రం స్థానాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: