ఒకవైపు కులమీడియా చంద్రబాబు నాయుడుకు జాకీలువేసి పైకిలేపుతూనే ఉంది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏం సాధించాడో చెప్పలేక పోతున్నారు. కేసీఆర్-జగన్-మోడీ  అంటూ ఈత్రయాన్ని ఒక గాటన కట్టి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి మీద అడ్డమైన బురద చిమ్ముతూ తెలుగుదేశం పార్టీని కాపాడు కోవాల ని కుల మీడియా ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. 


తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే ధ్యేయంగా బరితెగించి వ్యవహరిస్తూ ఉంది ఆ పార్టీ అనుకూలకుల మీడియా. మరో రెండు వారాల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యం లో, టీడీపీ అనుకూల మీడియా ఇంకా ఎలాంటి వేషాలు వేస్తుందో చూడాల్సి ఉంది. ఏ స్థాయికి దిగజారిందంటే "లోక్ నీతి - సీఎస్డీఎస్" ఉత్తర భారత మీడియా చేసిన సర్వే తో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయ దుంధుబులు మ్రోగిస్తూ అధికారంలోకి వస్తుందంటూ రాసింది.
chandrababu modi jagan kcr కోసం చిత్ర ఫలితం

నిజానికి అలాంటి సర్వే ఎప్పుడు జరగలేదని అ మీడియా ప్రకటన వెలువరించటమే కాదు ఈ వార్త ప్రచురించిన తెలుగు దేశం పార్టీ అనుకూల కులపత్రిక, కరపత్రంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని ప్రకటించింది.  ఆ సంగతలా ఉంటే, జాతీయ మీడియా మాత్రం నారా చంద్రబాబు నాయుడి కథ ముగిసిపోయిందని అంటుంది.
chandrababu modi jagan kcr కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు రాజకీయంగా ముందుకు సాగడానికి ఇక దారులు ఏవీలేవని అన్నీ దారులు మూసుకు పోయాయని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి.తాజాగా ప్రఖ్యాత జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ అందుకు సంబంధించి కథనాన్ని ఇచ్చింది. ఏపీలో ఉన్న రాజకీయపరిస్థితి గురించి మీడియా విశ్లేషించింది.


చంద్రబాబు రాజకీయంగా అనేక తప్పిదాలు చేశారని, పాలనపరంగా పూర్తిగా వైఫల్యం చెందారని ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని ఎకనామిక్స్ టైమ్స్ విశ్లేషించింది. చంద్రబాబు నాయుడు ఏవో కపట కుటిల వ్యూహాలతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంలో పడి పోయి సినీ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడం కూడా చంద్రబాబు వ్యూహమే అని ఆ పత్రిక విశ్లేషణ.


ప్రజల్లో పరువు ప్రతిష్ట పరపతి సర్వం కోల్పోయిన టిడిపి పవన్ కల్యాణ్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తాను గెలవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ అభిప్రాయపడింది. అయితే ఆ వ్యూహం ప్రతిఫలించే అవకాశాలు కనిపించడం లేదని ఎకనామిక్ టైమ్స్ పత్రిక విశ్లేషించింది. మొత్తం మీద తాజా రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు కథ అయిపోయిందని, ఈ ఎన్నికల ఫలితాలు - మే ఇరవై మూడు తర్వాత వెల్లడవనున్న దరిమిలా చంద్రబాబు నాయుడుకు ఇక రాజకీయంగా శాశ్విత విశ్రాంతేనని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి!
chandrababu modi jagan kcr కోసం చిత్ర ఫలితం
తాజాగా ఏపీలో బీజేపీ సంగతి ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో మాత్రం మరోసారి కమలం పార్టీనే ప్రభావం చూపవచ్చనే  జాతీయ సర్వేలు అంచనా వేస్తున్నాయి తొలిదశ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న వేళ ఈ సారి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచేది "కమలం పార్టీ" నే అని అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే బీజేపీ సొంతంగా మెజారిటీని సంపాదించు కోలేకపోయినా, ఆధిఖ్యానికి అతి దగ్గరగా వెళ్లేది మాత్రం కమలం పార్టీనే అని, కమల వికాసం తప్పదని సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. 


ఈ విషయాన్ని చాలాకాలంగా చెబుతున్నాయి వివిధ మీడియా సంస్థల సర్వేలు. కాని నరేంద్ర మోడీని దించేయాలనే కసి మాత్రం ఓటర్లలో కనిపించడం లేదని ఆ సర్వేలు చెబుతూ వచ్చాయి. అలాగని మళ్లీ బీజేపీకి బంపర్ మెజారిటీ కట్టబెట్టే అవకాశాలు ఏమాత్రం లేవని, బిజేపి పరువు నిలబడటం మాత్రం ఖాయమని ఆ సర్వేలు అంచనా వేస్తూ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని చోట్లలో బీజేపీ కొన్నిసీట్లను కోల్పోయినా, మరొకచోట ఆ వెలితిని భర్తీ చేసుకునే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి.
సంబంధిత చిత్రం

తొలిదశ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నం అయిన వేళ కూడా అలాంటి సర్వేలే వెలువడుతూ ఉన్నాయి. బీజేపీ మెజారిటీ దగ్గర వరకూ వచ్చి ఆగుతుందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ కోలుకున్నా, సొంతంగా అధికారం దరిదాపుల్లోకి కూడా రాలేదని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ వైరిపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ కలసి మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ అధికారానికి దగ్గరయ్యే అవకాశాలు దాదాపులేవనే అంచనాలున్నాయి. తటస్థ పార్టీలుగా ఉన్న వైసిపి, టీఆర్ఎస్, బిజేడి ఎవరికి సహకరిస్తే వారే అధికారంలోకి వచ్చే అంచనాలు కూడా ఉన్నాయి.
Lotus verses all MOdi vs all కోసం చిత్ర ఫలితం
ఇక ఇప్పటికే కాంగ్రెస్ పక్షంవైపు చేరిపోయిన చంద్రబాబుకు ఈ సర్వేల పలితాలు ఏమాత్రం మింగుడు పడేవి కావు. బీజేపీ మళ్లీ మెజారిటీ దరిదాపుల్లోకి వస్తుందనే అంచనాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా బీజేపీని తిడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఒకవైపు ఏపీలో చంద్రబాబు పరిస్థితీ ఘోరాతి ఘోరంగా ఉందని సర్వేలు వస్తున్నాయి, ఇదే సమయంలో, కమలం పార్టీ తన పరిమళాలు వెదజల్లుతూ దూసుకుపోతూ ఉండటం, తెలుగు దేశానికి మరింత ఇబ్బంది కరమైన అంశమే! అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: