విజయవాడ సెంట్రల్‌.. విజయవాడలోనే అత్యంత కీలకమైన నియోజక వర్గం.. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ గాలి వస్తోంది.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు సానుకూల అంశాలు బాగా కలసి వస్తున్నాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గతంలో చేసిందేమీ లేదన్న అభిప్రాయంలో ఇక్కడి జనం  ఉన్నారు. 


వైసీపీ విజయం కోసం అన్ని వర్గాలు కలసి పనిచేస్తుంటే..టీడీపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అసలు ఇక్కడి నుంచి కాపు నేత వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయాలని భావించారు. వైసీపీ లో ఉన్నప్పుడు టికెట్‌ కోసం చాలా ప్రయత్నించారు.

కానీ సర్వేలు, నివేదికల ఆధారంగా జగన్ ఈ సీటును కాంగ్రెస్ నుంచి వచ్చిన మల్లాది విష్ణుకు ఇచ్చేశారు. దీంతో అసంతృప్తి చెందిన రాధాకృష్ణ కొన్నాళ్లు నాన్చి నాన్చి చివరకు టీడీపీలోకే వెళ్లారు. ఆయన వెళ్లినా ఆయన వెంట కేడర్ వెళ్లే పరిస్థితులు లేవు. 

రాధాకృష్ణ చేరికతో బలపడ్డామని టీడీపీ భావిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు బోండా ఉమాకు ఉన్న ఇమేజ్‌ కారణంగా ఈ సీటును టీడీపీ నిలబెట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. బోండా ఉమ ప్రజాసేవ సంగతి పక్కకు పెట్టిన పైరవీలు, సెటిల్‌మెంట్లతోనే కాలం గడిపారన్నది స్థానికుల మాట. అందుకే ఈ సీటు ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి వెళ్లిందన్న టాక్ నడుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: